సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకడు. హిందీలో ఈయన అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సైఫ్.. ఇప్పుడు `దేవర`లో మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తలపడుతున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాలో సైఫ్ `భైరా` అనే పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈయన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సైఫ్ గురించి తెలుగు సినీ ప్రియులు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే `దేవర` విలన్ సైఫ్ గురించి ఎన్నో విస్తుపోయే నిజాలు ఉన్నాయి. సుప్రసిద్ద క్రికెట్ ఆటగాడు, భారత జట్టు మాజీ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ దంపతుల కుమారుడే సైఫ్ అలీ ఖాన్. వీళ్లది నవాబుల వంశం. సైష్ ఫ్యామిలీకి వందల ఏళ్ల చరిత్ర ఉంది. సైఫ్ పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు. సైఫ్ మొదట నటి అమృతా సింగ్ ను పెళ్లి చేసుకోగా.. వీరికి సారా, ఇబ్రహీం జన్మించారు.
కొన్నేళ్లకు అమృతా సింగ్ నుంచి విడిపోయిన సైఫ్.. కరీనా కపూర్ తో ఏడడుగులు వేశాడు. వీరికి తైమూర్, జహంగీర్ జన్మించారు. వారసత్వంగా సైఫ్ కు వందల కోట్ల ఆస్తులు వచ్చాయి. ఈ నవాబు సాబ్ ఆస్తుల విలువ రూ. 12,000 కోట్ల పైమాటే. సైఫ్ వార్షిక ఆదాయం రూ. 30 కోట్ల రేంజ్‌లో ఉంటుంది. ఒక్కో సినిమాకు ఈయన రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఈయనకు హర్యానాలో చరిత్ర ఉన్న పటౌడీ ప్యాలెస్ ఉంది. దాని విలువ రూ. 800 కోట్లు. భోపాల్ లోనూ ఈయనకు రూ. 4,200 కోట్లు ఖరీదు చేసే పటౌడీ ప్యాలెస్ ఉంది. ఇక ముంబైలో ఈయనకు రెండు భారీ బంగ్లాలు, ఫామ్ హైస్ లు, లగ్జరీ కార్లు ఇలా ఎన్నో ఉన్నాయి.