లక్షలు ఇచ్చినా జబర్దస్త్ కు వెళ్లనంటున్న జోష్ రవి.. అదే కారణమా..?

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించాడు జోష్ రవి.. ఈయన సినిమాలలోనే కాకుండా జబర్దస్త్ లో కూడా యాక్టింగ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. అయితే ప్రస్తుతం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యాడు జోష్ రవి.. ఇటీవలే దయా అనే వెబ్ సిరీస్ లో కనిపించాడు.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జబర్దస్త్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు జోష్ రవి.

 

జోష్ రవి మాట్లాడుతూ.. జబర్దస్త్ అంటే నాకు చాలా ఇష్టం.. అంతేకాకుండా ఎంతో గౌరవం ఉంది. జబర్దస్త్ లో నేను పలు షోలలో నటించాను. ఇప్పుడు గెస్ట్ గా పిలిస్తే వెళ్తున్నాను ఎవరైనా స్కిట్లో సరదాగా కనపడమంటే వెళ్తాను.. అందులో స్కిట్స్ రెగ్యులర్గా చేయమంటే మాత్రం చేయను.. ఎందుకంటే అప్పట్లో రూ .2000 ఇచ్చేవాళ్లు ఇప్పుడు రూ .2లక్షలు ఇస్తామన్న జబర్దస్త్ కి వెళ్ళను అని చెప్పేశారు జోష్ రవి.

నేను సినిమాలు అనుకొనే పరిశ్రమకు వచ్చాను నా కెరీర్ సినిమాల్లోనే మొదలయ్యింది. మధ్యలో జబర్దస్త్ వచ్చింది కదా అని వెళ్లాను.. అది నా కెరీర్ కాదు నాకు సినిమాలే ముఖ్యము.. అందుకే నేను డబ్బుల కోసం ఈవెంట్స్ కి కూడా వెళ్ళను జబర్దస్త్ వాళ్లంతా ఈవెంట్స్ ఫంక్షన్స్ వెళ్లి డబ్బులు సంపాదించుకున్నారు. నేను కేవలం సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి సినిమాలు వస్తే చేస్తాను కానీ ఈవెంట్స్ కి మాత్రం వెళ్ళను అని అన్నాడడట. దీంతో జోష్ రవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.