ర‌జ‌నీ త‌ర్వాత ప్ర‌భాసే.. జైల‌ర్ – స‌లార్ మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా?

ప్ర‌స్తుతం థియేట‌ర్స్ లో జైల‌ర్ హ‌వా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, నెల్స‌న్ దిలీప్ కుమార్ కాంబోలో వ‌చ్చిన ఈ యాక్ష‌న్ డ్రామా.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద అరాచ‌కం సృష్టిస్తోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తూ.. ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. గ‌త కొన్నేళ్ల నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న ర‌జ‌నీ.. ఈ మూవీతో అదిరిపోయే రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. అయితే ఇదే త‌రుణంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది.

ర‌జ‌నీ జైల‌ర్ తో ప్ర‌భాస్ స‌లార్ కు లింక్ ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న స‌లార్ మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. వ‌చ్చే నెల‌లో స‌లార్ ఫ‌స్ట్ పార్ట్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌లార్ టీజ‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే స‌రిగ్గా గ‌మ‌నించిన‌ట్లైతే.. జైల‌ర్‌, స‌లార్ మ‌ధ్య ఉన్న ఒక కామ‌న్ పాయింట్ ఉంది.

అదేంటంటే.. రెండు చిత్రాల్లో హీరోను డైనోసార్ తో పోల్చ‌డం. సింహం, పులి లాంటి జంతువులు ఎంత క్రూరమైనవి అయినప్పటికీ డైనోసార్ ముందు కాదు అంటూ ప్ర‌భాస్ ను ఉద్దేశిస్తూ ఇటీవ‌ల స‌లార్ టీజ‌ర్ ను వ‌దిలారు. అలాగే జైల‌ర్ మూవీలోనూ రజనీకాంత్ ని డైనోసార్ తో పోల్చారు. ప్రస్తుతం డైనోసార్ బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేయడంలో బిజీగా ఉంది అంటూ జైలర్ నిర్మాణ సంస్థ కూడా ర‌జ‌నీని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టింది. జైలర్, సలార్ మధ్య కుదిరిన ఈ ఊహించని పోలికకి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. అంతేకాదు ర‌జ‌నీ త‌ర్వాత స‌లార్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసేది ప్ర‌భాసే అంటూ కామెంట్లు చేస్తున్నారు.