ఇండస్ట్రీలోకి వచ్చి శ్రీలీల అన్ని కోట్లు సంపాదించిందా..? మెగా హీరోలు కూడా వేస్ట్..!!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యంగ్ బ్యూటీ శ్రీ లీల హవానే కొనసాగుతుంది . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోలతో కలిసి నటిస్తుంది శ్రీలీల . ఇప్పటికే చేతిలో 12 సినిమాలకు పైగానే పెట్టుకొని ఉన్న శ్రీలీల బాలీవుడ్లో సైతం ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చి రెండు అంటే రెండేళ్లు కావస్తున్న ఈ బ్యూటీ అప్పుడే కోట్ల ఆస్తులను సంపాదించేసింది అన్న ప్రచారం జరుగుతుంది .

( Photos : Instagram )

మరీ ముఖ్యంగా ఆమె సినిమాల రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదు అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి . కాగా ఇండస్ట్రీలోకి వచ్చి మూడు సంవత్సరాలు కాకుండానే శ్రీలీల ఇన్ని కోట్లు సంపాదించడం ఇప్పుడు వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం శ్రీ లీల ఒక్కో సినిమాకి రెండు కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటుందట ..ఈ క్రమంలోనే గత ఆరు నెలలుగా ఆమె కమిట్ అయిన సినిమాల లిస్ట్ చూస్తే దాదాపు 30 కోట్లు వరకు సంపాదించింది అంటూ తెలుస్తుంది .

అంతేకాదు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే అందుకున్న ఇన్ని కోట్లు పారితోషకం అందుకున్న బ్యూటీగా రికార్డు నెలకొల్పింది శ్రీలీల, దీంతో జనాలు సైతం షాక్ అయిపోతున్నారు . ఇదే విధంగా కొనసాగితే శ్రీ లీల మెగా హీరోలను మించి పోయే రేంజ్ లో కూడా రెమ్యూనరేషన్ తీసుకొని ఆస్తులను కూడ పెట్టడం కన్ఫామ్ అంటున్నారు అభిమానులు..!!