రామ్ చరణ్ సినిమాని దొబ్బేసిన వరుణ్ తేజ్ .. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేయడం చాలా కామన్.. సర్వ సాధారణం అని చెప్పాలి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇలా ఒకరు కోసం రాసుకున్న కథలో మరొక హీరో నటిస్తూ ఉంటారు. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసుకున్న కథను అదే మెగా హీరో వరుణ్ తేజ్ దొబ్బేశాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది.

ఆ సినిమా మరేదో కాదు ఫిదా . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదట హీరోగా రాంచరణ్ అనుకున్నారట శేఖర్ కమ్ముల. ఆయన ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా కావడంతో రిజెక్ట్ చేశారట . అంతేకాదు ఈ రోల్ కోసం చాలామంది హీరోలను అప్రోచ్ అవ్వగా ఫైనల్లీ వరుణ్ తేజ్ ఈ రోల్ కి సూట్ అయ్యారట.

వరుణ్ తేజ్ కథ చెప్పగానే కళ్ళు మూసుకుని అగ్రిమెంట్ పేపర్ల సైన్ చేసేసాడట. ఆ తర్వాత ఆయన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్గా ఈ సినిమాని మలుచుకున్నాడు . ఈ సినిమా తర్వాతే వరుణ్ తేజ్ కెరియర్ టర్న్ అయింది అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ సినిమా లో సాయి పల్లవి-వరుణ్ రొమాన్స్ కేక అని చెప్పాలి..!!