వారి విడాకుల విలువ ఆరు లక్షల కోట్లు.. ఆ సెలబ్రిటీస్ ఎవరంటే ?

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ మిలిందాగెట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గెట్స్ అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. 2021 మే 4 న బిల్గెట్స్ అతని సతీమణి మిలిందా విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారికీ పెళ్లి జరిగిన 27 సంవత్సరాల తరువాత వారి బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుని అందరిని ఆశ్చర్యానికి గురించేసారు. ఈ క్రమంలోనే వారు విడాకులు తీసుకున్నారు. విడిపోయిన తరువాత బిల్గెట్స్ తన భార్యకు భరణం కింద ఎంత ఇచ్చాడో తెలుసుకోడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే దానికి సంబందించిన పూర్తి వివరాలు మీడియాలో చెప్పనప్పటికీ,  బిల్గెట్స్ మాత్రం మిలిందా కి భారీగానే చెల్లించినట్లు తెలుస్తుంది.

ఆ వివరాలోకి వెళ్తే బిల్గెట్స్ అతని మాజీ భార్యకు దాదాపు 73 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లో 6 లక్షల కోట్ల రూపాయలు భరణంగా చెల్లించాడని సమాచారం. దాంతో ప్రపంచంలోనే అత్యంత విడాకుల భరణం తీసుకున్న మహిళలో ఒకరిగా మిలిందా నిలిచింది. అయితే ఫోర్బ్స్ ప్రకారం ప్రస్తుతం బిల్గెట్స్ పూర్తి ఆస్తి విలువ 119.4 డాలర్లు అని తెలుస్తుంది. బిల్గెట్స్, మిలిందా దంపతులు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా,కొన్ని ధార్మిక కార్యక్రమాల ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందారు. వారి 27 ఏళ్ళ వివాహ జీవితానికి నిదర్శనంగా  3 పిల్లలు కూడా ఉన్నారు.

అయితే వారు దంపతులుగా కలిసి ఉండలేనప్పటికి ఫౌండేషన్ ద్వారా కలిసి పని చెయ్యడానికి రెడీగా ఉన్నాం అని ప్రకటించారు. ఇక బిల్గెట్స్ జంట మాత్రమే కాకుండా దుబాయ్ రాజు షేక్ మహుమద్ బీన్ రిషీద్ అల్ మక్తు, తన మాజీ భార్య జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ హుస్సేన్ కు రూ. 5,555 కోట్లు భరణంగా చెల్లించారు. ఇతను కూడా భరణంగా అతని భార్యకి భారీగానే ముట్టచెప్పాడు. అంతేకాకుండా ఆస్ట్రెలియా, అమెరికా వ్యాపారావేత్త మొఘల్ కూడా 1999లో విడాకులు తీసుకొని అతని భార్యకు 1.7 బిలియన్ డాలర్లు భరణం గా ఇచ్చారు.