కూతురు పుట్టాలని నాగార్జున అలా చేసాడా..? అమల అంతలా ఏడ్చేసిందా..? పాపం..!!

సమాజంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నేటి కాలంలో మగ పిల్లల కంటే అమ్మాయిలే బెటర్ అనుకునే రోజులు వచ్చేసాయి . అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా అలాగే అనుకునే స్టా హీరో ఉన్నారు. ఆయన మరెవరో కాదు అక్కినేని నాగార్జున . మొదటి నుంచి నాగార్జునకు ఆడపిల్లలంటే చాలా చాలా ఇష్టమట. మొదటి భార్య లక్ష్మీ ప్రెగ్నెంట్ అయినప్పుడే ఆడపిల్ల పుడుతుంది మహాలక్ష్మి వస్తుందని ఆశ పెట్టుకున్నారట. నాగచైతన్య పుట్టారు.

ఆ తర్వాత పరిస్థితులు అనుకులించక.. ఆమెకు విడాకులు ఇచ్చేసి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఆ తర్వాత అమలకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ టైంలోనూ ఆడపిల్ల పుడుతుంది అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నారట . అంతేకాదు ఫారిన్ కంట్రీస్ కి తీసుకెళ్లి ఆమెకు జండర్ టెస్ట్ కూడా చేయించారట . ఆ టెస్ట్ లో కూడా ఆడపిల్ల అంటూ వచ్చిందట . అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ.. లాస్ట్ కి నాగార్జున అమలకు అఖిల్ పుట్టాడు .

ఆ టైంలో నాగార్జున బిడ్డా పుట్టాడని ఆనందపడాలో అనుకున్న బిడ్డ పుట్టలేదని బాధపడాలో తెలియనంత అయోమయ స్థితిలో ఉండిపోయారట . ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకొని మెల్లగా కాలంతో ముందుకు నడిచాడు. అయితే పుట్టబోయేది పాపే అని జెండర్ టెస్టులో తెలియడంతో నాగార్జున అమల పాపకు కావాల్సిన వస్తువులు అన్నీ కొని పెట్టుకున్నారట. అయితే ఆ తర్వాత ఆ వస్తువులను తమ ఇంట్లో పని చేసే పని అమ్మాయికి ఇచ్చేసినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో అమల – నాగార్జునులకు ఆడపిల్ల అంటే ఎంత ఇష్టమో..? కనీసం మనవరాలు పుట్టిన బాగుంటుంది.. ఆ ఇంట్లో అంటూ చెప్పుకు వస్తున్నారు..!!