విడాకులైన హీరోయిన్ తో పెళ్లికి రెడీ అవుతున్న త‌రుణ్‌.. ఆమె ఎవ‌రో తెలిస్తే షాకే!?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లిస్ట్ లో త‌రుణ్ ఒక‌డు. నాలుగు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా ఈయ‌న పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త‌రుణ్.. ఆ త‌ర్వాత హీరోగా మారి త‌క్కువ స‌మ‌యంలో స్టార్డ‌మ్‌ను ద‌క్కించుకున్నాడు. ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేశాడు. కొన్నాళ్లు కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోయినా.. ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు ప‌డ‌టం వ‌ల్ల‌ ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు.

సినిమాల‌కు దూర‌మైన త‌ర్వాత వ్యాపార‌రంగంలో రాణిస్తున్న త‌రుణ్‌.. ఇంత వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. గ‌తంలో ఆర్తి అగ‌ర్వాల్ తో త‌రుణ్ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగాడు. కానీ, పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండా విడిపోయారు. ఆ త‌ర్వాత త‌రుణ్ ఒంటిరిగానే ఉండిపోయాడు. అయితే తాజాగా త‌రుణ్ పెళ్లి గురించి ఓ షాకింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. విడాకులైన హీరోయిన్ తో త‌రుణ్ పెళ్లికి రెడీ అవుతున్నాడ‌ట‌.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌రుణ్ త‌ల్లి, న‌టి రోజా ర‌మ‌ణి.. త‌న‌యుడి పెళ్లి గురించి మాట్లాడింద‌ట‌. త‌రుణ్ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని.. ఇండ‌స్ట్రీలో ఉన్న ఓ బ‌డా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి త‌మ ఇంటికి కోడ‌లుగా రాబోతోంద‌ని రోజా ర‌మ‌ణి చెప్పార‌ట‌. దీంతో నెటిజ‌న్లు బ‌డా ఫ్యామిలీ అంటే ఖ‌చ్చితంగా మెగా ఫ్యామిలీనే అని.. ఇటీవ‌ల భ‌ర్త చైత‌న్య నుంచి విడాకులు తీసుకున్న నిహార‌క‌నే త‌రుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు. కాగా, గ‌తంలో త‌రుణ్ పెళ్లిపై అనేక రూమ‌ర్లు వ‌చ్చాయి. మ‌రి ఇది కూడా రూమారేనా.. లేక నిజ‌మా.. అన్న‌ది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.