ఆ న‌టి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ధ‌ర ఎన్ని కోట్లో తెలిస్తే గ‌గ్గోలు పెట్టేస్తారు!

సాధార‌ణంగా లేడీస్ కు హ్యాండ్ బ్యాగ్స్ పై మ‌క్కువ ఎక్కువ‌. ఆ మ‌క్కువ‌తోనే ఎక్క‌డికి వెళ్లినా హ్యాండ్ బ్యాగ్స్ ను కొనుగోలు చేస్తుంటారు. ఇక సినీ తార‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వారి ద‌గ్గ‌ర ఉండే హ్యాండ్ బ్యాగ్ క‌లెక్ష‌న్ షాపుల్లో కూడా ఉండ‌వు. అయితే సామాన్యులతో పోలిస్తే సెల‌బ్రెటీల హ్యాండ్ బ్యాగ్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. ల‌క్ష నుంచి పాతిక ల‌క్ష‌ల రేంజ్ లో ఉంటాయి.

కానీ, అమెరికాకు చెందిన ప్రముఖ నటి, మోడల్, వ్యాపారవేత్త కిమ్ కర్దాషియాన్ ద‌గ్గ‌ర ఓ విలువైన హ్యాండ్ బ్యాగ్ ఉంది. దాని ధ‌ర ఎంతో తెలిస్తే గ‌గ్గోలు పెట్టేస్తారు. ఫ్యాషన్‌ రంగంలో దూసుకుపోతున్న కిమ్‌.. ఖ‌రీదైన డ్రెస్‌లు, యాక్ససరీస్ తో త‌ర‌చూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటుంది. తాజాగా ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ తో వార్త‌ల్లో నిలిచింది. రీసెంట్ గా కిమ్ కర్దాషియాన్ జపాన్ వెళ్లారు.

ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన కిమ్.. ఓ బ్యాగ్ తీసుకుని వెళ్లింది. సిల్వర్ కలర్ లో మెరిసిపోయిన ఆ హ్యాండ్ బ్యాగ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే ఆ బ్యాగ్ ధ‌రెంతో తెలిశాక‌.. నెటిజ‌న్ల‌కు ఫ్యూజులు ఎదిగిపోయాయి. ఎందుకంటే, ఆ హ్యాండ్ బ్యాగ్ ధ‌ర రూ.3.12 కోట్లు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రూ.3,12,61,000. ప్రతిష్టాత్మక హీర్మేస్ కంపెనీ ఈ బ్యాగ్ ను త‌యారు చేసింది. గోల్డ్ మ‌రియు డైమండ్స్‌ తో కలిపి ఈ బ్యాగ్ ను డిజైన్ చేశారు. ప్రపంచంలో చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఈ బ్యాగ్‌ని కలిగి ఉన్నారు. అందులో కిమ్ ఒక‌రు.