తగ్గిన రజనీకాంత్ క్రేజ్.. ఫ్యాన్స్ ఆవేదన..!!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా కొన్ని కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రజనీకాంత్ గత ఆరు సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. రోబో సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు సాధించిన రజనీకాంత్ అప్పటినుంచి ఇప్పటివరకు భారీ కమర్షియల్ చిత్రాల తో అభిమానులను మెప్పించలేకపోతున్నారు. చాలా చిత్రాలు రజనీకాంత్ కి తీవ్రమైన నిరాశను మిగిల్చేలా చేశాయి..

Rajinikanth Fans In Madurai Cut 15-Foot Customized Cake To Celebrate His  72nd Birthday!

తమిళంలో ఏ స్థాయిలో అయితే కలెక్షన్లు నమోదయ్యాయి తెలుగులో కూడా రజనీకాంత్ సినిమాలు కలెక్షన్ల పరంగా దక్కించుకునేవి కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పవచ్చు.. ఒకప్పటిలాగా రజనీకాంత్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.. ఇక్కడ మాత్రమే కాకుండా తమిళనాడులో కూడా ఒకప్పుడు ఉన్న క్రేజ్ రజినీకాంత్ కి ప్రస్తుతం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా రజనీకాంత్ వయసు మీద పడుతున్నప్పటికీ.. కొన్ని రాజకీయ కారణాల వల్ల కూడా రజనీకాంత్ కు క్రేజ్ తగ్గిపోతోందని సమాచారం.

Happy Birthday Rajinikanth: The star who epitomises the Tamil film industry  - India Today

గతంలో సోషల్ మీడియాలో రజనీకాంత్ సినిమా విడుదలవుతోందంటే చాలు తెగ హడావిడి ఉండేది కానీ ప్రస్తుతం అంత సీను లేదని తెలుస్తోంది. వచ్చేవారం రజనీకాంత్ జైలర్ సినిమా విడుదల కాబోతున్నప్పటికీ ప్రేక్షకులలో పెద్దగా సినిమా గురించి టాక్ వినపడలేదు. మరి ఒకవేళ జైలర్ సినిమా సక్సెస్ అయితే రజనీకాంత్ కు పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి మరి. రజనీకాంత్ తగ్గుతున్న క్రేజ్ ను చూసి అభిమానులు సైతం కాస్త నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. జైలర్ సినిమాతో తమ హీరో కచ్చితంగా సక్సెస్ అవుతారని కామెంట్లు చేస్తున్నారు.