హీరో య‌ష్ కు యంగ్ బ్యూటీ శ్రీ‌లీల మ‌ర‌ద‌లు అవుతుంద‌ని మీకు తెలుసా?

టాలీవుడ్ ను త‌న క‌నుసైగ‌ల‌తో ఏలేస్తున్న యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల ప్ర‌స్తుతం ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దాదాపు ప‌ది ప్రాజెక్ట్ లు శ్రీ‌లీల చేతిలో ఉన్నాయి. గుంటూరు కారం, భ‌గ‌వంత్ కేస‌రి, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, స్కంద వంటి భారీ చిత్రాల్లో సైతం శ్రీ‌లీల భాగ‌మైంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. `కేజీఎఫ్‌` మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న క‌న్న‌డ హీరో య‌ష్ కు శ్రీ‌లీల మ‌ర‌ద‌లు అవుతుంద‌ని మీకు తెలుసా..? అవును మీరు విన్న‌ది నిజ‌మే.

కానీ, య‌ష్‌-శ్రీ‌లీల బంధువులు కాదు. వీరి ఫ్యామిలీస్ మ‌ధ్య ఎలాంటి చుట్ట‌రికం లేదు. య‌ష్ కుటుంబంతో శ్రీ‌లీల ఫ్యామిలీకి మంచి స‌న్నిహిత్యం ఉంది. య‌ష్ స‌హ‌న‌టి రాధిక పండిట్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దంప‌తుల‌కు ఒక కూతురు, ఒక కుమారుడు జ‌న్మించారు. అయితే రాధికకు డెలివరీ చేసింది మ‌రెవ‌రో కాదు శ్రీ‌లీల త‌ల్లి స్వర్ణలత.

శ్రీ‌లీల త‌ల్లి స్వర్ణలత బెంగళూరులో మంచి గైనకాలజిస్ట్. ఆమెకు ఎంతో పేరు ఉంది. అయితే రాధిక‌కు రెండు సార్లు స్వ‌ర్ణ‌ల‌త‌నే డెలివ‌రీ చేశారు. ఈ క్ర‌మంలోనే య‌ష్‌-రాధిక‌ల‌తో స్వ‌ర్ణ‌ల‌త‌, శ్రీ‌లీల‌కు స‌న్నిహిత్యం ఏర్ప‌డింది. ఆ స‌న్నిహిత్యంతోనే రాధిక‌ను అక్కా అని, య‌ష్‌ను బావ అని శ్రీ‌లీల పిలుస్తుంది. త‌ర‌చూ శ్రీ‌లీల య‌ష్ ఇంటికి కూడా వెళ్తుండేది. ఈ విష‌యాన్ని గ‌తంలో శ్రీ‌లీల స్వ‌యంగా వెల్ల‌డించింది. అలా హీరో య‌ష్ కు శ్రీ‌లీల మ‌ర‌ద‌లు అయిపోయింద‌న్న‌మాట‌.