టాలీవుడ్ హీరోల‌పై ఫీలింగ్స్ బ‌య‌ట‌పెట్టిన త‌మ‌న్నా.. ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల్లేదుగా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓవైపు భోళా శంక‌ర్ మ‌రోవైపు జైల‌ర్ ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కిస‌న జైల‌ర్ ఆగ‌స్టు 10న విడుద‌ల కాబోతుండ‌గా.. చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ త‌మ‌న్నానే హీరోయిన్ గా చేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ రెండు సినిమాలను ప్ర‌మోట్ చేస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా భోళా శంకర్ సినిమా కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. కమెడియన్ ఆది ఈ ఇంటర్వ్యూకి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌న్నా భోళా శంక‌ర్ సినిమాకు సంబంధించి అనేక విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల‌పై త‌న ఫీలింగ్స్ ను బ‌య‌ట‌పెట్టింది. తన‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న స్టార్ హీరోలంద‌రి గురించి త‌మ‌న్నా మాట్లాడింది. చిరంజీవి వన్ అండ్ ఓన్లీ ప‌ర్స‌న్ అని.. ఎవరూ ఆయనలా ఉండలేరని త‌మ‌న్నా తెలిపింది.

అలాగే ఎన్టీఆర్ ఆల్ రౌండర్ అని, డ్యాన్స్ ఫైట్స్ ఇలా ఏదైనా చేసేస్తాడ‌ని.. రామ్ చ‌ర‌ణ్ రాయల్ అని త‌మ‌న్నా పేర్కొంది. ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కల్యాణ్ చాలా మాస్, చాలా స్టైలిష్ అని.. ప్రభాస్ అందరి డార్లింగ్ అని తెలిపింది. అల్లు అర్జున్ టాలీవుడ్ కు స్టైలిష్ స్టార్ అని, ఇప్పుడు దేశమంతా పాపులర్ అయ్యారని.. మహేష్ బాబు మోస్ట్ గ్లామరస్ హీరో అని మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది. దీంతో త‌మ‌న్నా కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.