భోళా దెబ్బకు రెమ్యూనరేషన్ తగ్గించిన చిరంజీవి..!!

చిరంజీవి ,డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది ఆచార్య సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా చిరంజీవి ఖాతాలో మిగిలిపోయింది.. బంధువైన మెహర్ రమేష్ నిలబెట్టాలని చిరంజీవి చేసిన ప్రయత్నం వృధాగా మిగిలిపోయింది.. తమిళ సినిమా వేదాళం సినిమాతో పోల్చుకుంటే.. భోళా శంకర్ సినిమా ఏ యాంగిల్ లో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకర కెరియర్ లో కూడా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Bhola Shankar (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఏజెంట్ సినిమా తర్వాత భోళా శంకర్ సినిమా కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో ఈ ఎఫెక్ట్ మొత్తం ప్రస్తుతం రెమ్యూనరేషన్ మీద పడ్డట్టుగా తెలుస్తోంది. చిరంజీవి ప్రతి సినిమాకి రూ .40 నుంచి రూ.50 కోట్ల రూపాయల వరకు చార్జ్ చేస్తూ ఉండేవారు.. దీంతో సినిమా బడ్జెట్ రూ .100 నుంచి రూ.120 కోట్లు మాత్రమే అవుతూ ఉండేది. అయితే బిజినెస్ మాత్రం రూ .100 కోట్లు దాటలేకపోవడంతో కొంతవరకు నిర్మాతలకి టెన్షన్ గానే ఉండేదని చెప్పవచ్చు. అలాగే వరుస రీమిక్స్ చేయడం కూడా చిరంజీవికి మైనస్ అయిందని చెప్పవచ్చు.

చిరంజీవి ప్రస్తుతం సినిమాకు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మాత్రం నిర్మాతలు సిద్ధంగా లేరని బిజినెస్ లెక్కలు అన్ని చూసుకుంటే ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వడం కష్టమనే పరిస్థితులలో చిరంజీవి బడ్జెట్ తగ్గించుకునే పనిలో ఉన్నట్లు వినిపిస్తోంది.. కేవలం చిరంజీవికి రూ.30 నుంచి రూ.35 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ఇవ్వగలరని నిర్మాతలు తెలియజేస్తున్నట్లు సమాచారం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమా బాగా లేదంటే అసలు ప్రేక్షకులు సినిమా థియేటర్ వైపు కూడా అడుగు వేయడం లేదు. దీంతో చిరంజీవి సినిమాలకు కూడా భారీ నష్టాలు తప్పడం లేదు.