ఆర్య 2 లో యాక్ట్ చేసిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన మూవీస్‌లో మొదటి మూవీ ఆర్య. ఈ మూవీ బాక్సాఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. తరువాత వీరిద్దరి కాంబినేషన్లోనే ఈ సినిమాకు సీక్వెల్‌గా ఆర్య 2 సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించకపోయినా ఈ సినిమాలో పాటలు అప్పట్లో బీభత్సం సృష్టించాయి.

ఈ సినిమా తర్వాత నుంచే పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపారు. అల్లు అర్జున్ లో కూడా పురోగతి బాగా పెరిగింది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్‌గా నవదీప్ నటించిన సంగతి తెలిసిందే. నవదీప్ చిన్నప్పటి రోల్ లో నటించిన ఆ చిన్న కుర్రాడు అందరికీ గుర్తుండే ఉంటాడు. అతడు ఇప్పుడు పెద్దవాడైపోయాడు.. ఏకంగా పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమాలో నటించిన రేంజ్‌కు ఎదిగిపోయాడు.

ఇంతకీ ఎవరు అతను అనుకుంటున్నారా.. అతనే అనుదీప్. ఇటీవల పవన్ – సాయిధరమ్ తేజ్ మల్టీ స్టార‌ర్‌గా తెరకెక్కిన బ్రో ది అవతార్ సినిమాలో తనికెళ్ల భరణి కొడుకుగా అనుదీప్ నటించాడు. ఇందులో నెగటివ్ రోల్ ప్లే చేసిన అనుదీప్ క్యారెక్టర్ చివరిలో బయటపడడంతో సాయిధరమ్ తేజ్ క్లైమాక్స్‌లో అనుదీప్‌ను చితక్కొడతాడు. అనుదిప్ పెదైన‌ తర్వాత నటించిన మొట్టమొదటి సినిమా బ్రో ది అవతార్. ఇక అత‌డు భవిష్యత్తులో ఎన్నో భారీ ప్రాజెక్ట్ సినిమాలలో నటించి ఏ రేంజ్‌లో క్రేజ్ సంపాదిస్తాడో చూడాలి.