తన జీవితంలో ఫస్ట్ టైం బర్త డే రూల్ బ్రేక్ చేసిన చిరంజీవి.. అభిమానులు షాక్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి పుట్టిన రోజు నేడు . నేడు మెగా ఫ్యాన్స్ ఎంత హ్యాపీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ సొంత ఇంటి మనిషి పుట్టిన రోజు చేసినట్టు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మెగాస్టార్ ఇంటి వద్ద అర్ధరాత్రి నుండి కోలాహలం నెలకొంది . భారీ కటౌట్లతో ఫ్లెక్సీలతో రచ్చ రంబోలా చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ . అయితే మెగాస్టార్ చిరంజీవి నేడు 68వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు .

తన 67 ఏళ్ల జీవితంలో చిరంజీవి ఎప్పుడు కూడా తన పుట్టినరోజు నాడు మొదటి విషెస్ వాళ్ళ అమ్మ గారి చేతే చెప్పించుకునేవారు . అంజనాదేవి ఏరోజు కూడా చిరంజీవి బర్త్డే విషెస్ ను వేరే వాళ్ళు మొదట చెప్పనిచ్చే వాళ్ళు కాదు. అలా చెప్పిన ఒప్పుకునే వారు కాదు. అయితే ఫస్ట్ టైం బర్తడే రూల్ బ్రేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి . తన 68వ పుట్టినరోజు ఎంతో స్పెషల్గా ట్రీట్ చేస్తూ తన మనవరాలు క్లీం కార చేతనే విష్ చేయించుకున్నాడు.

సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు వెళ్లి ఆమె చేతులను తన చేతిలోకి తీసుకొని ..”ఇవాళ నా పుట్టినరోజు రా నాన్న అంటూ ప్రేమగా ముద్దాడారట”. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే చిరంజీవి తల్లి సైతం ఆ మూమెంట్స్ చూసి సంబరపడిపోయారట . చిరంజీవికి తన మనవరాలు అంటే ఎంత ఇష్టమో అంటూ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు . అంతేకాదు కొంతమంది మెగా అభిమానులు షాక్ అయిపోతున్నారు. మెగాస్టార్ ఇంత సెంటిమెంటల్ ఫెలోనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి మెగాస్టార్ కెరియర్ లోనే తన 68వ పుట్టినరోజు సో సో స్పెషల్ అనే చెప్పాలి..!!