చిరు- రవితేజ కెరీర్ లో జరిగిన ఒకే సంఘటన ఏమిటో మీకు తెలుసా.. చూస్తే ఆశ్చర్యపోతారు..!

మన తెలుగు చిత్రపరిశ్ర‌మ‌లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు మొదట్లో ఎన్నోఇబ్బందులు పడి తర్వాత హీరోలుగా మారి స్టార్ డంను దక్కించుకున్నారు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటి హీరోలలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటే.. మాస్ మహారాజా రవితేజ రెండో స్థానంలో ఉంటాడు.

ఇద్దరు హీరోలు కూడా ఎంతో మంచి టాలెంట్ ఉన్నవారు కావటం ఇక్కడ మరో విశేషం. అదేవిధంగా ఈ ఇద్దరిలో ఉన్న ఓకే క్వాలిటీస్ ఏమిటంటే. చిరు- రవితేజ కూడా ముందుగా తమ పేర్లను మార్చుకున్నారు. ఇక ఇద్ద‌రు కూడా కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించారు. చిరంజీవి మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అలాగే రవితేజ కూడా సేమ్ మాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఉంది. ఇలా వీరిద్దరిలో చాలాగుణాలు ఒకేలా ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరూ కూడా టాలీవుడ్ లోనే మంచి స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లోనే దూసుకుపోతున్నారు.

ఇక్కడ రవితేజ ముందుగా చిరంజీవికి వీర అభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే రవితేజ ఇండస్ట్రీ లోకి రావటం జరిగింది. వీరిద్దరూ ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు వరుస క్రేజీ సినిమాలతో టాలీవుడ్ లోనే దూసుకుపోతున్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మరి రాబోయే రోజులైనా మరోసారి చిరు- రవితేజ కలిసి నటిస్తారో లేదో చూడాలి.