బొమ్మరిలు 2 వచ్చేస్తుందోచ్.. హీరో-హీరోయిన్లు ఎవరో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రావచ్చు .. ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ఇండస్ట్రీలు రాజ్యం ఏలేసేయొచ్చు కానీ కొన్ని కొన్ని సినిమాలు తెరపై ఎన్నిసార్లు చూసినా టీవీలో మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అలాంటి సినిమాల్లో ఒకటే బొమ్మరిల్లు . భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా సిద్ధార్ధ్ హీరోయిన్గా జెనీలియా నటించారు . ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరీ ముఖ్యంగా సిద్ధార్ధ్ ను సిద్ధుగా జెనిలియాను హాసినిగా గుర్తించుకునే స్థాయికి వెళ్లిపోయారు ఈ సినిమాతో ఆ నటీనటులు . ఈ సినిమాకి త్వరలోనే సీక్వెల్ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే బొమ్మరిల్లు 2 సినిమాల్లో మాత్రం హీరో హీరోయిన్లు ఎవరో తెలిస్తే మాత్రం ఫాన్స్ ఎగరిగంతెయ్యాల్సిందే. వాళ్లు మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ .

ఈయన బొమ్మరిల్లు 2 సినిమాలో హీరోగా నటించబోతున్నాడట , అంతే కాదు హీరోయిన్గా ముగ్గురు పేర్లు వినబడుతున్నాయి. శ్రీలీల-మృణాల్ ఠాకూర్-రష్మిక మందన్నా లు ఈ ముగ్గురు పేర్లు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి బొమ్మరిల్లు వన్ తో తన కెరీర్ ని మార్చేసుకున్న భాస్కర్ .. ఆ తర్వాత అలాంటి హిట్ అందుకోలేకపోయాడు . కనీసం బొమ్మరిల్లు 2 తో అయినా అలాంటి హిట్ అందుకుంటాడు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు..!! చూద్దాం మరి ఏం జరుగుతుందో..!!