మెగాస్టార్ చిరంజీవి మరో రెండు రోజుల్లో `భాళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తే.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు పాత్రను పోషించింది. ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
రీమేక్ మూవీ అయినా కూడా టీజర్, ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ తో `భోళా శంకర్`పై బాగానే హైప్ పెంచారు. బుక్కింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. మెగాస్టార్ గత చిత్రం వాల్తేరు వీరయ్య కంటే తక్కువే బిజినెస్ జరిగినా.. ఓవరాల్ గా పర్వలేదనే చెప్పుకోవాలి.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 67.60 కోట్లకు భోళా శంకర్ థియేట్రిక్ హక్కులను కొనుగోలు చేశారు. అలాగే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ టోటల్ బిజినెస్ రూ. 79.60 కోట్లు జరిగింది. ఈ లెక్కన భోళా శంకర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.80.50. మరి ఈ టార్గెట్ ను మన మెగాస్టార్ రీచ్ అవుతాడా.. లేదా.. తెలియాలంటే ఎల్లుండి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏరియాల వారీగా భోళా శంకర్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి.
నైజాం: 22 కోట్లు
సీడెడ్: 12 కోట్లు
ఉత్తరాంద్ర: 9.50 కోట్లు
తూర్పు: 6.20 కోట్లు
పశ్చిమ: 4.40 కోట్లు
గుంటూరు: 6 కోట్లు
కృష్ణ: 4.50 కోట్లు
నెల్లూరు: 3కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ = 67.60 కోట్లు
———————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 5 కోట్లు
ఓవర్సీస్: 7 కోట్లు
————————————————-
వరల్డ్ వైడ్ బిజినెస్= 79.60కోట్లు( బ్రేక్ ఈవెన్ – 80.50కోట్లు)
————————————————-