మ‌హేష్‌కు చాలా స్పెష‌ల్‌గా బ‌ర్త్ డే విషెస్ చెప్పిన సితార‌.. ఎంత స్టైల్‌గానో…!

ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు(48) పుట్టినరోజు సందర్భంగా ఆయన గారాల పట్టి సితార ఇన్‌స్టాగ్రామ్ లో మహేష్ బాబుకు స్పెషల్‌గా విషెస్ తెలియజేసింది. ఓ రెస్టారెంట్లో డైనింగ్ టేబుల్ వద్ద సీతారా, మహేష్ బాబు కూర్చుని ఆనందంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న పిక్ షేర్ చేసింది.

కారణం తెలీదుకాని మ‌హేష్‌ చేతిలో వాటర్ గ్లాస్ పట్టుకుని నవ్వుతూ సితారను చూస్తుంటే సితార ఫేస్ కు చెయ్యి అడ్డుపెట్టుకొని క్యూట్ గా నవ్వుకుంటూ ఆ ఫోటోకు ఫోజులు ఇచ్చింది. జీవితంలో మనం కలిసి పంచుకునే గొప్ప క్షణాలు ఇవి. లవ్ యు నాన్న. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని ఘట్టమనేని ప్రిన్సెస్ రాసుకు వచ్చింది.

ప్రస్తుతం సితార ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తండ్రికి పెట్టిన స్పెషల్ విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సితారతో పాటు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికపై విషెస్ తెలియజేశారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుంచి న్యూ లుక్ కూడా రిలీజ్ అయింది.