స్మార్ట్… కూల్‌గా ఎన్టీఆర్ న్యూలుక్…. వామ్మో రు. 8 కోట్లా…!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటే ఎన్టీఆర్ పలు యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌ లీషియస్ ఫుడ్, యాపీ ఫిజ్, మెక్ డొనాల్డ్స్ వంటి యాడ్స్ చేశారు.

ఈ క్ర‌మంలోనే త‌న కొత్త యాడ్ కోసం ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైర‌ల్‌గా మారింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీం ఎన్టీఆర్ ని సూపర్ స్టైలిష్ గా ప్రిపేర్ చేసి ఓ మిర్రర్ పిక్ తీశాడు. ఎన్టీఆర్ స్మార్ట్ అండ్ కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ హెయిర్ స్టైల్ కేవలం ఓ యాడ్ కోసం ఎన్టీఆర్ మార్చాడని తెలుస్తుంది.

నిన్ననే ఎన్టీఆర్ ఈ కొత్త లుక్ కి చేంజ్ అయ్యాడట. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ పిక్‌ని చూస్తూ తెగ సంబరపడిపోతున్నారు. ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ రు. 8 కోట్ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తున్నాడ‌ట‌.