బట్టలు విప్పి పడుకోమన్నాడు.. స్టార్ డైరెక్టర్‌పై యాంక‌ర్‌ వర్షిణి సంచ‌ల‌న కామెంట్స్‌..!

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్నది అన్ని చోట్ల ఉంది. ఇప్పటికే చాలామంది స్టార్ యాక్టర్స్ వారికి జరిగిన క్యాస్టింగ్ కౌచ్‌ ఎక్స్పీరియన్స్‌లను సోషల్ మీడియా వేదికగా మీటు ఉద్యమం పేరుతో షేర్ చేసుకున్నారు. ఇప్పటికీ చాలామంది షేర్ చేసుకుంటూనే ఉన్నారు. అలా ఢీ షోలో గ్లామరస్ యాంకర్ గా వ్యవహరించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వర్షిణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.

ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షిణి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అని చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ కు ముందు ఒక వెబ్ సిరీస్ అవకాశం కోసం నేను ఆడిషన్స్‌కు వెళ్లాన‌ని అక్కడ ఆ వెబ్ సిరీస్ దర్శకుడుని కలవాల్సి వచ్చిందని.. ఆయన నన్ను చూసి బాగున్నావ్ నువ్వు ఈ వెబ్ సిరీస్‌కు బాగా సెట్ అవుతావని చెప్పాడని.. తర్వాత నా చేయి పట్టుకుని సడన్‌గా బెడ్ పైకి లాగి నా డ్రెస్ విప్పమని అడిగాడని.. నాకు చాలా భయం వేసిందంటూ వివరించింది.

వెంటనే బయటకు వచ్చేసి కార్లో కూర్చొని ఏడ్చానని నా జీవితంలో ఎదురైనా ఒకే ఒక చేదు అనుభవం అదే అంటూ వర్షిణి వివరించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోతతో కుర్ర కారుకు చెమ‌టలు పట్టిస్తు ఉంటుంది వ‌ర్ష‌ణి. అయితే ప్రస్తుతం ఈ గ్లామరస్ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.