కూతురు సుప్రీత‌తో క‌లిసి ప‌బ్‌లో ర‌చ్చ చేస్తోన్న సురేఖ‌వాణి ( వీడియో )

సురేఖ వాణి టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్‌ ఆర్టీస్ట్‌గా పరిచయం ఉన్న వ్యక్తి. ఎన్నో సినిమాల్లో అక్క, వదిన, అత్త పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సురేఖ వాణి సినిమాల్లో కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కూతురు సుప్రీతతో కలిసి ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తల్లి కూతుళ్లు కలిసి మోడరన్ వేర్‌లో షార్ట్ వీడియోస్ షేర్ చేసి ఎప్పటికప్పుడు ట్రోల్స్‌కి గురవుతూనే ఉంటారు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సురేఖ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తాజాగా తన కూతురు సుప్రీత బర్త్‌డే సందర్భంగా సురేఖ బిగ్ సర్ప్రైజ్‌ని ప్లాన్ చేసింది. తండ్రితో సుప్రీత‌ ఉన్న ఫోటోను అమెరికాలోని న్యూజెర్సీలో ఓ బిల్డింగ్ పై ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. ఇక ఫోటో చూసిన సుప్రీత బాగా ఎమోషనల్ అయింది.

దీనికి సంబంధించిన వీడియోను సురేఖ తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఆ పోస్ట్ తెగ వైరల్ అయింది. అంతేకాకుండా తన బర్త్డే సందర్భంగా పబ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి డాన్సులు చేస్తూ హంగామా చేసిన ఫొటోస్ వీడియోస్ కూడా సుప్రీత తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)