అమ్మ బాబోయ్‌.. `బిగ్ బాస్ 7` బ‌డ్జెట్ అన్ని కోట్లా.. పెద్ద రిస్కే చేస్తున్నారు!

బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ షోస్‌లో బిగ్ బాస్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. అనేక భాష‌ల్లో ఈ షో ప్ర‌సారం అవుతోంది. స్టార్ మా ఛానల్ ని ఇండియా లోనే నెంబర్ 1 స్థానం లో కూర్చోబెట్టిందీ షో. తెలుగులో ఇప్ప‌టికే ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. త్వ‌ర‌లోనే బిగ్ బాస్ సీజ‌న్ 7 కూడా స్టార్ట్ కాబోతోంది. ఇప్ప‌టికే కొన్ని ప్రోమోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే గ‌త రెండు సీజ‌న్లు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు.

ఈ నేప‌థ్యంలోనే సీజ‌న్ 7ను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 3 ఆదివారం రాత్రి నుంచి బిగ్ బాస్ ఆట మొదలు కాబోతుంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఈ సీజన్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉండబోతుంద‌ని నాగార్జున ఆల్రెడీ పేర్కొన్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జ‌రిగిపోయింది. సీజ‌న్ 7లో కొత్త‌వారిని కాకుండా పాపులర్ సెలబ్రిటీస్ తో నింపేయ‌బోతున్నారు.

అలాగే క‌ఠిణ‌మైన టాస్క్‌ల‌తో కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ ముప్ప తిప్ప‌లు పెట్ట‌బోతున్నాడ‌ట‌. ఇక‌పోతే తాజాగా బిగ్ బాస్ బ‌డ్జెట్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈసారంతా పాపుల‌ర్ సెల‌బ్రెటీసే కావ‌డంతో.. వారికి రెమ్యున‌రేష‌న్ గ‌ట్టిగానే ఇస్తున్నార‌ట‌. అలాగే బిగ్ బాస్ హౌస్ కోసం వేసిన సెట్స్ మరియు ఇతర ఖర్చులన్నీ కలిపి సుమారుగా రూ. 47 నుంచి 50 కోట్ల రేంజ్ లో బ‌డ్జెట్ అయింద‌ట‌. ఇది ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్నీ సీజన్స్ కంటే భారీ బడ్జెట్ అని.. బిగ్ బాస్ 7 కోసం మేక‌ర్స్ చాలా పెద్ద రిస్క్ చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఈ తాజా సీజ‌న్ ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో చూడాలి.