సంపాద‌న‌లో ఎక్క‌డా త‌గ్గ‌ని త‌మ‌న్నా… వామ్మో అన్ని కోట్ల ఆస్తా…!

తమన్నా భాటియా సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. మొదట తమిళ్ మూవి కేడి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా ఆ సినిమా నిరాశపరిచినా తర్వాత కల్లూరి మూవీ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. తమన్న తెలుగులో టాలీవుడ్ అగ్ర హీరోలు అందరు సరసన నటించి మెప్పించింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ కోలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ దక్కించుకుంది తమన్నా.

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలో ఒకటి రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపించిన ఒక పాట ద్వారా మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఐటెం సాంగ్స్ లోను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గ్లామర్ షో లో ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోతుంది మిల్కీ బ్యూటి. ఇలా తమన్నా తన సినీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు కళ్ళు చెదిరే ఆస్తులను కూడబెట్టిందట. తాజాగా తమన్నా రెమ్యూనరేషన్‌కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ ఏడాదికి రూ.12 కోట్లకు పైగా డబ్బులు కూడా పెడుతుందట. నార్మల్ గా ఒక్క సినిమాకు రూ.4 నుంచి 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక స్పెషల్ సాంగ్స్ కు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తుందట. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ, వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరిస్తూ కోట్లను అర్జిస్తుంది. 2018లో ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 10 నిమిషాల పాటు మెరిసిన తమన్న రూ.50 లక్షల దాకా డబ్బు తీసుకుందట. తమన్నా ముంబైలో నివసిస్తున్న అపార్ట్మెంట్ ఖరీదే రూ.16 కోట్లని తెలుస్తుంది. వీటితో పాటే లేడ్రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, బీఎండబ్ల్యూ సహా 4 అరుదైన రకాల కార్లను తమన్నా కొనుగోలు చేసిందట. అంతేకాదు ఈమె సొంతంగా ఒక బంగారు నగల షాప్ నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. మొత్తం మీద తమన్నా తన సినీ కెరియర్ లో రూ.120 కోట్ల ఆస్తిని సంపాదించుకుందని న్యూస్ వైరల్ అవుతుంది.