గోల్డెన్ లెగ్ సంయుక్త కి మూవీస్‌ రాకపోవడానికి కారణం అదే..

ప్రముఖ నటి సంయుక్త మినన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ చిన్నది. పవన్ కళ్యాణ్ హీరోగా  రానా  విలన్ గా  నటించిన ఈ సినిమా లో సంయుక్త మీనన్,రానా కి భార్య గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసారా’ , ధనుష్ సరసన ‘సార్’ , సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘వీరుపాక్ష’ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను అల్లరించింది.

వీరుపాక్ష సినిమా లో చాతబడి వచ్చిన అమ్మాయి గా సంయుక్త మీనన్ నటన అధరగొట్టేసిందనే చెప్పాలి. అయితే సంయుక్త మీనన్ విరుపక్ష సినిమా తరువాత కాస్త సైలెంట్ అయిందనే చెప్పాలి. ఈ మధ్య మహేష్ బాబు సినిమా లో సంయుక్త నటించబోతుంది అనే వార్త చక్కర్లు కొట్టింది కానీ ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దానికోసం కారణం ఏంటా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ కి ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. కానీ సంయుక్త నే అన్ని ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పడం లేదని తెలుస్తుంది.

ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం సంయుక్త కి ప్రేక్షకులలో బాగా క్రేజ్ పెరిగిపోవడం తో ఈ అమ్మడు రెమ్యూనరేషన్ ని కూడా భారీగా పెంచేసిందట. అంతేకాకుండా కథలోని తన పాత్ర విషయంలో ఎక్కువగా ఆశలు పెట్టుకుంటుందట. అలానే షూటింగ్ జరిగే సమయంలో ప్రతీ చిన్న విషయం లో సంయుక్త వేలుపెట్టి దర్శకులకు చిరాకు తెప్పిస్తుందట. అందుకే వచ్చిన ఆఫర్స్ వెనక్కి వెల్లిపోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రమేవారికి తెలీదు. సంయుక్త మీనన్ అభిమానులు మాత్రం మా గోల్డెన్ లెగ్ బ్యూటీ కి మంచి ఆఫర్స్ రావాలి అని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సంయుక్త చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ వాటిలో ఎన్ని ఫైనల్ అవుతాయి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.