ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. లాంచ్ చేయనున్న యంగ్ బ్యూటీ..!

కన్నడ యంగ్ బ్యూటీ శ్రీలీల కి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏకంగా తొమ్మిది సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈవెంట్ ని లాంచ్ చేయబోతుందని సమాచారం. నేడు వైజాగ్ వచ్చి ఈవెంట్లో సందడి చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఆరు టీమ్స్ తో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ టు ఈ సంవత్సరం జరగబోతోంది.

ఆగస్టు 16 అంటే నేటి నుంచి ఆగస్టు 26 వరకు ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ .. వైజాగ్ లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇకపోతే ఈరోజు అనగా ఆగస్టు 16 సాయంత్రం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గ్రాండ్ గా లాంచ్ ఈవెంట్ జరపబోతోంది. ఇక ఈవెంట్ ని లాంచ్ చేయడానికి శ్రీ లీల హాజరవుతున్నారు. శ్రీ లీలా తో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు, పలువురు సినీ, టీవీ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ఇక ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆరు టీమ్స్ ఉన్నాయి. వాటిలో గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్, వైజాగ్ వారియర్స్ , రాయలసీమ కింగ్స్, ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్ అనే టీమ్స్ పోటీ పడబోతున్నాయి.

ఇందులో లోకల్ ప్లేయర్స్ తో పాటు వేరే రాష్ట్రాల ప్లేయర్స్ కూడా పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన మొదటి అడుగులో భాగంగా ఇప్పుడు మరింత ముందుకు వెళుతుందని చెప్పవచ్చు.