టీడీపీ రెడ్లలో ఈ సారి గట్టెక్కేది ఎవరు?

ఏపీలో కులాల వారీగా రాజకీయం జరగడం అనేది కొత్త కాదు..అసలు రాజకీయం పూర్తిగా కులాల పరంగానే సాగుతుంది. ఇక ప్రధాన పార్టీలో ఒకే కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. వైసీపీలో రెడ్లు, టి‌డి‌పిలో కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఎక్కువ. అలా అని వైసీపీలో కమ్మ నేతలు, టి‌డి‌పిలో రెడ్డి నేతలు లేకుండా లేరు. గత ఎన్నికల్లో వైసీపీలో రెడ్డి వర్గం నేతలు ఎక్కువ గెలిచారు. దాదాపు 40 మందిపైనే ఎమ్మెల్యేలు రెడ్డి వర్గం వారు గెలిచారు. అలాగే వైసీపీలో కమ్మ ఎమ్మెల్యేలు గెలిచారు.

అయితే టి‌డి‌పిలో కమ్మ నేతలు గెలిచారు..కానీ రెడ్డి వర్గం నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. టి‌డి‌పి నుంచి కూడా ఓ 20 మందిపైనే రెడ్డి వర్గం నేతలు పోటీ చేసి ఉంటారు..కానీ ఎవరు గెలవలేదు. ఇక ఈ సారి గెలవాలనే పట్టుదలతో టి‌డి‌పి రెడ్లు ఉన్నారు. కాకపోతే వైసీపీ పెద్ద ఛాన్స్ ఇచ్చేలా లేదు. ఏదో కొంతమందికే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి తప్ప…మిగిలిన టి‌డి‌పి రెడ్లకు ఛాన్స్ కనిపించడం లేదు.

టి‌డి‌పి రెడ్లలో గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న నేత వచ్చి తాడిపత్రిలో జే‌సి ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత బనగానపల్లెలో బి‌సి జనార్ధన్ రెడ్డి. ఇటు పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పలమనేరులో అమర్నాథ్ రెడ్డిలకు కాస్త ఛాన్స్ కనిపిస్తోంది. మంత్రాలయంలో తిక్కారెడ్డి గెలుపు కోసం కాస్త కష్టపడాలి.

ఇటు ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డికి కూడా కాస్త అవకాశం కనిపిస్తోంది. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టి‌డి‌పిలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సారి టి‌డి‌పి నుంచి గెలుపు కోసం కష్టపడాలి. ఆనం రామ్ నారాయణ రెడ్డి ఏ సీటులో పోటీ చేస్తారో క్లారిటీ లేదు..కానీ ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసిన టఫ్ ఫైట్ తప్పదు. మొత్తానికి అయిదారుగురు మాత్రమే టి‌డి‌పి రెడ్లు గెలిచేలా ఉన్నారు.