బాక్సాఫీస్ ని కుమ్మేసేందుకు వస్తున్న భారీ సినిమాలు..

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ యాభై రోజులు యూఎస్ లో ఎంజాయ్ చేసి ఈ మధ్యే హైదరాబాద్ కి వచ్చాడు. ఇక సినిమా షూటింగ్స్ లో బిజీ కావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2898 ఏడి ‘ , ‘రాజా డీలక్స్ ‘, ‘సలార్ ‘ లాంటి సినిమాలు ఉన్నాయి. మొదట ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా కి సంబందించిన షెడ్యూల్ ని ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో భాగంగా ప్రభాస్, దీప్తిక పదుకోనే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదల అవుతుంది అని గతం లో చిత్ర బృందం ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి సినిమా విడుదల అవ్వడం కష్టమే అని తెలుస్తుంది.

ఇక మారుతీ దర్శకత్వం వహిస్తున్న ‘రాజా డీలక్స్’  సినిమాని తొందరగా పూర్తి చెయ్యాలి అనుకుంటున్నాడట ప్రభాస్. అలానే ప్రభాస్ నటిస్తున్న ఇంకో సినిమా ‘ సలార్ ‘ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. మొదటి భాగంగా ‘సలార్ : సీజ్ ఫైర్ ‘ సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రాభోతుంది. త్వరలోనే రెండో భాగం షూటింగ్ ని ప్రారంభించాలని  ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. దాంతో ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ లో చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ దేవర ‘ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రెండు వారాలు రెస్ట్ తీసుకొని జులై 31 న తిరుగి ‘ దేవర ‘ షూటింగ్ లో పాల్గొంటున్నారు నటినటులు. ఈ కొత్త షెడ్యూల్ రెండు వారాల పాటు జరగనుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ని పీటర్ హేయిన్స్ అండ్ టీమ్ వారు డిజైన్ చేస్తున్నారట.

ఈ షెడ్యూల్ తో ‘దేవర’ సినిమా కి సంబందించిన ముఖ్యమైన పార్ట్ పూర్తవుతుంది. ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. నవంబర్ లోగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ఈ సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు జరిగితున్నట్లు తెలుస్తుంది. ఇక దేవర సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా ‘వార్ 2 ‘ లో ఎన్టీఆర్ నటిస్తారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ఈమధ్య కాస్త గ్యాప్ వచ్చింది. మళ్లీ ఈ నెల ప్రారంభంలో పుష్ప 2 షూటింగ్ సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నాడట సుకుమార్. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి అయితే ఈ ఏడాది చివర్లో పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.