వెక్కి వెక్కి భోరున ఏడ్చేసిన యాంకర్ అనసూయ(వీడియో) .. ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా అనసూయ పేరు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురవుతుంది. కారణాలు ఏవైనా కానీ అనసూయ పేరు సోషల్ మీడియాలో పలు అంశాల కారణంగా ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది . అయితే ఎప్పుడూ తన అల్లరితో తన చిలిపితనంతో తన ఫోటోషూట్స్ తో కుర్రాళ్ళను కవ్వించే అనసూయ ఫస్ట్ టైం గుక్క పట్టి ఏడుస్తూ వీడియోని షేర్ చేసింది .

ఈ వీడియో చూసిన ఎవరైనా సరే అనసూయ ని చూసి కంటతడి పెట్టక తప్పదు . అయితే అసలు ఆమె ఎందుకు ఏడ్చింది..? ఆమెకు అంత బాధ ఏమొచ్చింది..? అనేది మాత్రం ఇంకా తెలియలేదు . తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అనసూయ గుక్క పట్టి ఏడుస్తూ తన బాధను మొత్తం షేర్ చేసుకుంది .న ఆమె ఏడుస్తున్నప్పుడు ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయి ..ఫేస్ అంతా డల్ గా మారిపోయి ..చూస్తుంటేనే మనకు ఏడుపు వచ్చే విధంగా ఉంది . అయితే అనసూయ ఈ వీడియోని పోస్ట్ చేస్తూ సుదీర్ఘంగా ఓ నోట్ రాసుకొచ్చింది.

” ప్రపంచంలో ఎలాంటి వాళ్ళైనా సరే గొప్పవాళ్ళు కావచ్చు మంచి వ్యక్తులు కావచ్చు ..వాళ్లకి బాధలు ఉంటాయి.. కష్టాలు ఉంటాయి ..సుఖాలు ఉంటాయి జీవితంలో వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అయితే కష్టాలు వచ్చినప్పుడు ఏడవడంలో తప్పులేదు . బాగా ఏడ్చి ఆ బాధనంతా బయటకు పంపేసి తిరిగి మళ్ళీ మామూలు స్థితికి రావాలి . మళ్లీ స్ట్రాంగ్ గా కం బ్యాక్ ఇవ్వాలి. బాధను వదిలేసేందుకు నేను ఏడుస్తున్నాను. మొదట నా పోస్టులు చూసి అంతా కన్ఫ్యూజ్ అవుతారని నాకు తెలుసు . ఒకరితో రిలేషన్ పెంచుకోవాలని ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదేశం గా మార్చాలని ఒకరికొకరు అందంగా నిలవాలని సమాచార విషయాలను పంచుకోవాలని జీవనశైలి సంస్కృతులను అనుభవించాలని తెలిపింది . అంతే కాదు తన పోస్ట్ ఉద్దేశం ఏంటంటే అన్ని ఫోటోషూట్లు . ఫోజులు క్యాండిడేట్స్, చిరునవ్వులు, డాన్స్ బలమైన కౌంటర్లు అన్నీ నా జీవితంలో భాగమే మీరు కూడా అలానే ఉన్నారు . కాబట్టి నేను అదంతా మీతో పంచుకుంటున్నాను . నా జీవితంలో కొన్ని దశలో అంత బలంగా లేను..చాలా వీక్ అయిపోయాను.. నా బాధను నేను మర్చి పోవడానికి ఇలా ఏడుస్తున్నాను ..ఎప్పుడు సవాళ్లను నుంచి నిష్క్రమించవద్దు తిరిగి మరింత బలంగా కం బ్యాక్ కావాలని కోరుకుంటున్న “అంటూ తన భావాలను షేర్ చేసుకుంది అనసూయ. అయితే అనసూయ ఎందుకు ఏడుస్తుంది ..? ఆమెకు అంత బాధ ఏం వచ్చింది ..? అనేది మాత్రం ఆమె బయటకు చెప్పలేదు . సోషల్ మీడియాలో అనసూయ ఏడుస్తున్న వీడియో వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)