`గుంటూరు కారం` నుంచి ఆమె ఔట్‌.. అడుగ‌డుగునా ఈ అడ్డంకులేంట్రా బాబు!

గుంటూరు కారం.. మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో కానీ.. అడుగ‌డుగునా అడ్డంకులే ఎదుర‌వుతున్నాయి. గ‌త ఏడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైనా ఇప్ప‌టి వ‌ర‌కు ముప్పై శాతం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు అంటే.. ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. దీనికి తోడు ఈ మూవీ నుండి ఒక‌రి త‌ర్వాత త‌ప్పుకుంటూనే ఉన్నారు.

మొద‌ట ఇందులో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే, సెకండ్ హీరోయిన్ గా శ్రీ‌లీల‌ను తీసుకున్నారు. ఏమైందో ఏమో కానీ.. పూజా హెగ్డే గుంటూరు కారం నుండి ఔట్ అయింది. దాంతో శ్రీ‌లీల‌ను మెయిన్ హీరోయిన్ గా చేసి.. మీనాక్షి చౌద‌రిని రెండో హీరోయిన్ గా ఎంపిక చేశారు. గ‌తంలో ఈ సినిమా ఫైట్ కొరియోగ్రాఫర్ మారిపోయాడు. అలాగే గుంటూరు కారం సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ ఈ ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయ్యాడు.

ఇక చాలా రోజులు గ్యాప్ త‌ర్వాత బుధ‌వార‌మే ఈ మూవీ షూటింగ్ రీస్టార్ట్ అయింది. త్వ‌ర‌లోనే మ‌హేష్ బాబు కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఇంత‌లోనే గుంటూరు కారం నుంచి మ‌రొక‌రు ఔట్ అయినట్లు వార్త‌లు వ‌స్తున్నారు. న‌టి ర‌మ్య‌కృష్ణను ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం ఎంపిక చేశారు. ఆమె కొన్ని డేట్స్ ను కేటాయించింది. అయితే ప‌లుమార్లు షూటింగ్ వాయిదా ప‌డ‌టంతో.. ర‌మ్య‌కృష్ణ డేట్స్ వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల.. మ‌హేష్ మూవీకి కొత్త డేట్స్ ఇవ్వ‌డం క‌ష్టంగా మారింద‌ట‌. దాంతో చేసేదేమి లేక ఆమె ఈ సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని.. ర‌మ్య‌కృష్ణ స్థానంలో మ‌రొక‌రిని ఎంపిక చేసే ప‌నిలోనే త్రివిక్ర‌మ్ ఇప్పుడు ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత గంద‌ర‌గోళం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న గుంటూరు కారం ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో చూడాలి.