ఇండియన్ మూవీస్ ని దారుణంగా ట్రోల్ చేశారు కట్ చేస్తే..

సోషల్ మీడియాలో మన ఇండియాన్ సినిమాలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ విదేశాల్లోని చాలామంది ప్రజలు, సెలబ్రిటిలు ఇండియన్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. క్రికెటర్ లా దెగ్గర నుండి మారుమూల తెగల్లో జీవించేవారి వరకూ చాలామంది భారతీయ సినిమాలకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంట్టారు. ఇంకొంతమందేమో ఇండియా సినిమాలోని కొన్ని సీన్స్ ని స్పూఫ్ చెయ్యడం లాంటివి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఒక వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది. కానీ వీడియో భారత సినీ ప్రేమిఖులకు అసలు నచ్చడం లేదు. ఆ వీడియో ఇండియన్ సినిమాలను చులకన చేసే విధంగా గా ఉంది. మన ఇండియా సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ లో హీరోలు ట్రక్కులను, కార్లను తన్నీతే అవి దూరంగా వెల్లిపడుతుంటాయి. మన దర్శకులు హీరోలను ఒక ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ లా చూపించడం కోసం అలాంటి యాక్షన్ సన్నివేశాలు పెడుతుంటారు. ఆడియన్స్ కూడా ఆ యాక్షన్ సీన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా ఏదయినా సినిమా లో దర్శకుడు,హీరోని తక్కువ చేసి చూపిస్తే ఆ సినిమా ని కచ్చితంగా ప్లాప్ అయ్యేలా చేస్తారు ప్రేక్షకులు.

అందుకే ఆడియన్స్ అందరికి నచ్చే విధంగా ఏ సినిమా లో అయిన హీరోని చాలా పవర్ ఫుల్ గా చూపిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ కొంతమంది యూత్ మన ఇండియాన్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి అనే విధంగా ట్రోల్స్ చేసి ఇండియాన్ సినిమా లను అవమానించారు. అసలు విషయంలోకి వెళ్తే ‘ ఒక వాటర్ బాటిల్ రోడ్డు మీద పడిపోవడం తో అక్కడే ఉన్న పిల్లాడు దాని తీసుకోడానికి వస్తాడు. ఆ టైమ్ లోనే ఎదురుగా ఒక బైక్ వస్తుంది. దానికి బ్రేకులు పడకపోవడంతో బైక్ పిల్లాడి దెగ్గరకి వస్తుంది. అప్పుడు చాలా దూరంగా ఉన్నా ఒక బైకర్ వచ్చి బ్రేక్ లను సరిచేస్తాడు. వెంటనే బైక్ పిల్లాడికి తగలకుండా ఆగిపోతుంది’. ఆ వీడియో కి ఇండియాన్ మూవీస్ ఇలా ఉంటాయని ట్యాగ్ పెట్టారు. దాంతో ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.