ప్ర‌పంచంలో అతి త‌క్కువ విడాకులు తీసుకున్న దేశం ఏదో తెలుసా… ఇండియా ర్యాంక్ ఇదే..!

గత కొద్ది సంవత్సరాల నుంచి ఎంతోమంది వివాహాలు చేసుకున్నప్పటికీ ఏడాది కాకముందే విడాకులని కోరుకుంటున్నారు. అమ్మాయి నచ్చకపోయినా పెద్దవాళ్లు చూపించిన సంబంధం అని చేసుకోవడం.. ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు రావడం అత్తగారింట్లో వేధిస్తున్నారంటూ కారణాలు చూపించి ఏడాది తిరక్క ముందే విడాకులు తీసుకుంటున్నారు.

ఇలా పెద్దలు కుదుర్చుకునే వివాహాలు ప్రేమ వివాహాలని కాకుండా ఎంతో మంది జంటలు ఎప్పటికప్పుడు విడాకులు కోరుకుంటూ కోట్ల మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఒక భారతదేశంలోనే కాదు ఇతర దేశాలన్నిటిలోను విడాకుల విషయంలో ఇలాగే జరుగుతున్నాయి. ఇక‌ ఏ దేశంలో ఎంత శాతం విడాకులు తీసుకుంటున్నారు అనే అంశం ఒకసారి చర్చిద్దాం.

• భారతదేశం 1శాతం . వియత్నాం 7 శాతం జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. తజకిస్తాన్ 10 శాతం, ఇరాన్ 14 శాతం, మెక్సికో 17 శాతం, ఈజిప్ట్ 17 శాతం, సౌతాఫ్రికా 17 శాతం, బ్రెజిల్ 21 శాతం, టర్కీ 25 శాతం ఇలా అన్ని దేశాల‌లో జంటలు విడాకులు తీసుకుంటున్నారు. ఈ రిపోర్టు ప్రకారం అతి తక్కువగా విడాకులు కేవలం మన భారతదేశంలోనే తీసుకుంటున్నారు. మన భారతదేశంలో వివాహబంధం పై ఉన్న అవగాహన గౌరవమే దీనికి కారణాలు. పెళ్లి అంటే ఎంతో పవిత్రంగా భావించే భారతీయులు విడాకులు తీసుకోవడానికి ఎంతగానో ఆలోచిస్తారు.