అప్పుడే నెక్స్ట్ సినిమాకి సైన్ చేసిన వైష్ణవి చైతన్య.. హీరో ఎవరంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే మారుమ్రోగిపోతుంది . ఇన్నాళ్లు ఆమెను యూట్యూబర్ గా గుర్తించిన జనాలు ఇప్పుడు బేబీ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య అంటూ పేరు మెన్షన్ చేసి మరి ఆమెను నోటీస్ చేస్తున్నారు. దీంతో వైష్ణవి చైతన్య ఈ సినిమా ద్వారా ఎంత గుర్తింపు సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు . కాగ విజయ్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన లవ్ – రొమాంటిక్ – ఎంటర్టైనర్ సినిమా బేబీ.

ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేస్తుంది. కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా సక్సెస్ సెలబ్రేషన్స్ సైతం గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు బేబీటీం. కాగా ఇదే సక్సెస్ మీట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యి బేబీ సినిమాకి బెస్ట్ విషెస్ అందించారు. అంతేకాదు హీరోయిన్ వైష్ణవి చైతన్య ఓ రేంజ్ లో పొగిడేసారు . తెలుగు ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలు రావాలి అని అప్పుడే తెలుగు ఇండస్ట్రీ ముందుకు వెళ్తుందని బాగా మాట్లాడారు .

రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం వైష్ణవి చైతన్య తన రెండో సినిమాకి సైతం సైన్ చేసినట్లు తెలుస్తుంది . వైష్ణవి చైతన్య రెండో సినిమా ఎవరితో చేస్తుందో తెలిస్తే కళ్ళు జిగేల్ అనాల్సిందే . ఎవరో కాదు అల్లు శిరీష్.. ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి . అలాంటి అల్లు హీరోలతో వైష్ణవి చైతన్య రెండో సినిమాకి అవకాశం దక్కించుకుంది అంటే దానికి కారణం బేబీ సినిమా అనే చెప్పాలి . అల్లు అరవింద్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో శిరిష్ తో సినిమా అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య ని చూస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!