హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన రీసెంట్ మూవీస్ ఇవే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగితున్న కొంతమంది హీరోలు నటించిన సినిమాలు విడుదల అయిన 6 రోజులోనే అత్యధిక కలెక్షన్స్ తమ ఖాతాలో వేసుకుంటారు. అలా రెండు తెలుగు రాష్ట్రాలో కలిపి అత్యధిక కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మీడియం రేంజ్ హీరోల టాప్ 5 సినిమాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మారుతీ దర్శకత్వం వహించిన ‘ప్రతిరోజు పండగే’ సినిమా లో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించారు. ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలో కలిపి రూ. 2.80 కోట్లను కలెక్ట్ చేసింది.

పరశురామ్ దర్శకత్వం వహించిన ‘గీత గోవింద’ సినిమా లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించారు. ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలో కలిపి రూ. 2.61 కోట్లు వసూలు చేసింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించి ‘అ ఆ ‘ సినిమాలో నితిన్ హీరోగా నటించగా సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలైన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.21 కోట్లు కలెక్ట్ చేసింది.

సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ‘బేబీ ‘ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. ఈ సినిమా విడుదలైన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.45 కోట్లు వసూలు చేసింది. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతుంది.


వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ‘ఎం సీ ఏ’ సినిమాలో నాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.13 కోట్లు కలెక్ట్ చేసింది.