సమంత కి తోడుగా అమెరికాకు స్టార్ హీరో.. ఈ ట్వీస్ట్ అస్సలు ఊహించలేదుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ క్రేజ్ సంపాదించుకున్న సమంత.. రీసెంట్ గానే మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే . ఓవర్గా ఎక్సర్సైజులు చేయడం.. డైటింగ్లు చేయడం .. శక్తికి మించిన బరువులు మోయడం కారణంగానే ఈ మయోసైటీస్ వ్యాధి సోకుతుంది అంటూ డాక్టర్లు చెప్పుకొచ్చారు. కాగా మరీ ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చిన తర్వాత కండరాలు బలహీనత ఎక్కువగా ఉంటుందని.. కొంచెం సేపు మించి నిల్చోలేరని.. కళ్ళు తిరిగినట్లు ఉంటాయని.. బాడీ చాలా సిక్ అయిపోతుందని .. సరైన టైంలో ఈ వ్యాధిని గుర్తించకపోతే ప్రాణాలే పోయే అవకాశం ఉందంటూ కూడా రష్యన్ డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు .

అయితే హీరోయిన్ సమంత ఈ వ్యాధి నుంచి ఎలాగాలో బయటపడింది అంటూ వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టే సమంత ఖుషి సినిమా షూటింగ్ లోను సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్ లోను చాలా యాక్టివ్గా పాల్గొనింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్ళీ సమంతకి వ్యాధి తిరగబడినట్లు తెలుస్తుంది . అందుకే సినిమాలకు బ్రేక్ చెప్పి మరి సమంత అమెరికాకు ట్రీట్మెంట్ కోసం వెళ్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే సమంతకి తోడుగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమెతో పాటు అమెరికాకు వెళ్లి ఆమె చికిత్స కోసం హెల్ప్ చేయనున్నారు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

ఎస్ ప్రెసెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గత కొంతకాలం నుంచి సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోకు దగ్గరవుతుందని ..ఆయనతో కలిసి జిమ్ వర్కౌట్స్ చేస్తుందని ఆయనకు సంబంధించిన పిక్స్ సైతం ఇన్స్టా స్టోరీస్ లో ఎక్కువగా పెడుతూ వచ్చింది అన్న కామెంట్లు వినిపించాయి . అయితే ఇప్పుడు సమంతకి తోడుగా ఆ హీరో అమెరికాకు కూడా వెళ్లడానికి సిద్ధమయ్యారట . ఆమె ట్రీట్మెంట్ అయ్యేవరకు ఆమెతో ఉండి ఆమెను మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా తిరిగి ఇండియాకి తీసుకొచ్చే బాధ్యత కూడా తనదే అంటూ సమంత తల్లికి ప్రామిస్ చేశారట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి సమంత దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో..?