బక్కగా తయారైన కీర్తిసురేష్.. ఇక నీ కెరీర్ ఖతం అంటూ ట్రోలింగ్.. ఇప్పుడేమైంది!

ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది ఎన్నో మంచి సినిమాలలో నటించింది. ఒకప్పటి నటి సావిత్రి బయోగ్రఫీతో తీసిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అదరగొట్టేసిందనే చెప్పాలి. ఈ సినిమాతో నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంది కీర్తి సురేష్. అలానే ఇటీవల నేచరల్ స్టార్ నాని సరసన పాన్ ఇండియా సినిమా ‘దసరా’లో నటించి ప్రేక్షకులను అలరించింది.

సోషల్ మీడియాలో కూడా గ్లామర్ పంట పండిస్తూ తెగ రెచ్చిపోతుంది కీర్తి. అయితే కెరీర్ ప్రారంభంలో కీర్తి సురేష్ కాస్త బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ అందరికీ డ్రీమ్ గర్ల్ అయింది. మహానటి సినిమాలో కాస్త లావుగా ఉన్నా సరే ఈ ముద్దుగుమ్మ అందరికీ తెగ నచ్చేసింది. కానీ ఆ తర్వాత ఈ అందరి హీరోయిన్ సన్నగా ఉండాలని ఏవేవో ప్రయత్నాలు చేసింది. చివరికి ఎవరూ మెచ్చని విధంగా చాలా బక్కగా అయిపోయింది. దాంతో ఆ సమయం లో అనేక నెగిటివ్ ట్రోల్స్ కి గురి అయింది. చాలా మంది ఆ సమయం కీర్తి సురేష్ ని నెగిటివ్ కామెంట్స్ తో ట్రోల్స్ చేసారు. ఆమె అంత బక్కగా ఉండటంతో అందంగా లేదని, సినిమాలకి పనికిరాదని అన్నారు.

అలా ఒకప్పుడు నెగిటివ్ ట్రోల్స్ కి గురయిన కీర్తి ఇప్పుడు మళ్లీ కాస్త ఒళ్ళు చేసింది. అలాగే వరుస అవకాశాలతో దూసుకెళ్తూ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. చమ్కీల అంగీ లేసి పాటకు ఈ ముద్దుగుమ్మ వేసిన డాన్స్ గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాలని ఉర్రూతలూగించింది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగిన ఈ అందాల తార తన సత్తా ఏంటో చాటుకుంటుంది. ఇప్పుడు భోళా శంకర్, సైరన్, రఘు తాత, రివాల్వర్ రీటా వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.