ఆ తెలుగు హీరో పబ్లిసిటీ పిచ్చోడు.. డబ్బులు ఇచ్చి మరీ పొగిడించుకుంటున్నాడుగా..!!

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్క విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. గ్లోబల్ స్థాయి హీరోలకి ఓ రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ..నార్మల్ హీరోలకి మరో రకంగా ఉంతుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎదుగుతున్న హీరోలకి మరో రకంగా ఫ్యాన్స్ ఉంటారు. అయితే కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న రెండు హిట్లనే కొట్టి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురవుతున్న ఈ హీరో కి అసలు ఫాలోయింగ్ ఏ లేదు . ఒక్కరంటే ఒక్కరు కూడా నేను ఈయన ఫ్యాన్ అని చెప్పుకునే దిక్కు కూడా లేదు.

అయితే ఆయన సినిమా రిలీజ్ చేస్తే మాత్రం సోషల్ మీడియాలో .. యూట్యూబ్ ఛానల్స్ లో ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. అయితే దీనంతటికీ కారణం ఆయన డబ్బులు ఇచ్చి పలువురు మనుషుల దగ్గర ఆయన సినిమా డప్పు ఆయనే కొట్టించుకుంటారట . ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . దీనితో సోషల్ మీడియాలో సదరు హీరోని ట్రోల్ చేస్తున్నారు . పేరుకి పెద్ద స్టార్ హీరో కొడుకే.. సొంతంగా కధలని చూస్ చేసుకోవడం కూడా రాని హీరో అంటూ ఆయన్ని ఎప్పటినుంచో జనాలు దెప్పిపొడుస్తూనే ఉన్నారు.

కాగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా చేయని ఈ హీరో వాళ్ళ బిజినెస్ల్లో మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు. అయితే ఆయనకి ఎప్పటికైనా స్టార్ హీరోగా సెటిల్ అవ్వాలని ..ఒక్క అవార్డు అయిన అందుకోవాలని కోరిక ఉందట . దానికోసమే ఆయన సంపాదించిన డబ్బులు ఆయనే సినిమాలు నిర్మించుకొని ఆయనే నష్టాలను సైతం ఎదుర్కొంటున్నాడు . ఇప్పటికే ఈ తెలుగు హీరో ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను..?