ఆ విషయంలో చిరంజీవికి ఎప్పుడో తెలుసు”.. టాప్ సీక్రేట్ ని బయటపెట్టిన తమన్నా..!!

తెలుగు ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా రీసెంట్గా నటించిన వెబ్ సిరీస్ జీకర్దా..లస్ట్ స్టోరీస్ 2. రెండిటిలోనూ అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. జీకర్దా లో టాప్ తీసేసి కనిపిస్తే మరో సిరీస్ లో మాత్రం చీర కట్టుకొని పద్ధతిగా కనిపించినట్లే కనిపిస్తూ ట్రెడిషనల్ బాడీ పార్ట్స్ తో టెంప్ట్ చేసింది . లస్ట్ స్టోరీస్ 2 లో కాబోయే భర్త విజయ్ వర్మతో ఘాటైన రొమాన్స్ చేసి సోషల్ మీడియాలో నానా హంగామా సృష్టించిన తమన్నా రీసెంట్గా బాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు హీరోలు చరణ్ – నాగచైతన్య పై సంచలన కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ..” తెలుగులో నేను చాలామంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను నటించాను. బిగ్గెస్ట్ హిట్స్ కూడా కొట్టాను . కానీ అందరిలోకి నాకు కంఫర్టబుల్గా అనిపించింది చరణ్ – నాగ చైతన్య . వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అలా పెంచారు కాబట్టే వాళ్లు హీరోయిన్స్ తో ఎలా నడుచుకోవాలి అన్న విషయం తెలుసు. ఒక ఆడపిల్ల ఇబ్బంది పడకుండా నడుచుకోగలిగిన వాదే అసలైన హీరో ..ఆ విషయంలో చరణ్ నాగచైతన్య టాప్ ప్లేస్ లో ఉంటారు . దానికి కారణం చిరంజీవి గారు నాగార్జున గారు పెంపకమే .

నేను ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అవుతానని చిరంజీవి గారికి ముందే తెలుసు . అందుకే చరణ్ తో సినిమా చేస్తున్న టైంలో నువ్వు టాప్ హీరోయిన్ అవుతావు గుర్తుపెట్టుకో రాసి పెట్టుకో అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాటే వాస్తవమైంది “అంటూ తమన్న సంచలన కామెంట్స్ చేసింది . అయితే తమన్నా.. చరణ్ – నాగచైతన్య లను మాత్రమే పోగడడం.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బన్నీ – ఎన్టీఆర్ – మహేష్ బాబు – -ప్రభాస్ ఇలాంటి స్టార్ హీరోలతో కూడా నటించింది . మరి వాళ్ల గురించి ఏమనుకోవాలి ..? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . దీనికి త్వరగా తమన్నా వివరణ ఇచ్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు సినీ ప్రముఖులు..!!