`ప్రాజెక్ట్ కె` టీమ్ చీప్ ట్రిక్స్‌.. చిర్రెత్తిపోతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెర‌కెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ `ప్రాజెక్ట్‌-కె`. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంటే.. అమితాబ్ బచ్చన్, క‌మ‌ల్ హాస‌న్‌, దిశా ప‌టానీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతోంది.

ఈ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా లాంఛ్ చేయ‌బోతున్నారు. జులై 19 నుంచి అమెరికాలోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకల జరగనున్నాయి. అక్కడే జులై 20న ప్రాజెక్ట్‌-కె టైటిల్‌, గ్లింప్స్ మ‌రియు రిలీజ్ డేట్ ను ప్ర‌క‌టించబోతున్నారు. అయితే రీసెంట్ గా చిత్ర టీమ్‌ ‘వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె?’ పేరుతో టీషర్ట్‌లను అందుబాటులోకి తెచ్చింది. కామిక్-కాన్ వేడుకలో భాగంగా ‘ప్రోజెక్ట్-కె’ టీషర్టులను ఫ్రీగా అందిస్తున్నామ‌ని చిత్ర టీమ్ వెల్ల‌డించింది.

ఈ ప్రాజెక్ట్ కె టీషర్ట్ కావాలంటే.. చిత్రయూనిట్ షేర్ చేసిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలని మేక‌ర్స్ పేర్కొన్నారు. అలాగే వైజ‌యంతీ మూవీస్ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్ లో దాదాపు మూడు సార్లు ఆ లింక్ ను ఉంచారు. కానీ, ఆ లింక్ ను ఎన్ని సార్లు ఓపెన్ చేసినా ఉప‌యోగం లేద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఎంత ప్ర‌య‌త్నించినా స‌ర్వ‌ర్ ఎర్ర‌ర్‌ చూపించ‌ద‌ని.. ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో చిత్ర టీమ్ నిమిషాల వ్య‌వ‌ధిలోనే స్టాక్ అయిపోయింద‌ని పేర్కొన్నారు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు చిర్రెత్తిపోయింది. లింకే ఓపెన్ కాలేదు.. స్టాక్ అయిపోవ‌డం ఏంట‌ని ఫైర్ అవుతున్నారు. ప్ర‌మోష‌న్స్ కోస‌మే `ప్రాజెక్ట్ కె` టీమ్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసింద‌ని.. అస‌లు ఇంత వ‌ర‌కు ఒక్క‌రికి కూడా ప్రాజెక్ట్-కె టీ ష‌ర్ట్ అందలేద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.