బ్లాక్ శారీలో శ్రీముఖి సోయగాలు.. అబ్బాయిలూ జరభద్రం..!

బుల్లితెర రాములమ్మగా తెలుగులో స్టార్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత యాంకర్ గా యూ టర్న్ తీసుకొని బుల్లితెరపై సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం పటాస్ షో తో పాపులారిటీ సొంతం చేసుకొని ఇప్పుడు ఎన్నో షోలకు రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ భారీ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ . అందులో భాగంగానే కాస్త సమయం దొరికితే చాలు గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.

Image

ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది భామలు బుల్లితెరపై యాంకర్ గా సత్తా చాటే ప్రయత్నం చేసినప్పటికీ అటు వాక్చాతుర్యంలోనూ ఇటు గ్లామర్ విషయంలోనూ ఈమెను టచ్ చేసేవారు ఇంకా రాలేదని చెప్పాలి. అంతలా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషూట్స్ తో నేటిజెన్లను అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసే ప్రతి ఫోటోకి కూడా లక్షల్లో వ్యూస్ లైక్స్ వస్తూ ఉంటాయి. మొన్నా మధ్య అందాలు ఆరబోస్తూ యువతను ఆకట్టుకున్న ఈమె ఈసారి ట్రెడిషనల్ లుక్ లోకి మారిపోయి శారీలో కుర్ర కారు మనసులను కొల్లగొడుతోంది.

తాజాగా బ్లాక్ సారీలో కనిపించి కనిపించని నడుము అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరొకవైపు పైట పక్కకు జరిపి మరీ అందాలను చూపెడుతూ యువతను అల్లాడిస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన చాలా మంది అబ్బాయిలు శ్రీముఖి అందాలకు జర జాగ్రత్త అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే శ్రీముఖి షేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ చాలా వైరల్ గా మారుతున్నాయి.