గాండీవధారి అర్జున ప్రీ-టీజర్ రిలీజ్ చేసిన వరుణ్ తేజ్.. ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్!! 

దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న “గాండీవధారి అర్జున” సినిమా 2023, ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇంకా ఇంచుమించు నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లను మేకర్స్ ముమ్మరం చేశారు. వారం రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. వరుణ్ తేజ్‌ని అర్జున్ వర్మగా, ఎస్సే (ఎలైట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ)లో అతని రోల్ చూపించేలా ఒక ఇంటెన్స్ గ్లింప్స్ ఆవిష్కరించారు. ఇదే అప్‌డేట్‌లో ప్రీ-టీజర్ త్వరలో రిలీజ్ అవుతుందనే లైన్‌ రాస్కొచ్చారు.

ఆ మాట ప్రకారమే తాజాగా వరుణ్ తేజ్ చేత గాండీవధారి అర్జున ప్రీ-టీజర్ రిలీజ్ చేయించారు. ఈ ప్రీ రిలీజ్ టీజర్ కంటే టీజర్ మరింత ఇంటెన్స్‌, థ్రిల్లింగ్, ఎగ్జైటింగ్గా ఉంటుందని వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. ఇక ప్రీ-టీజర్‌లో ఒక కారులో వరుణ్ తేజ్ దూసుకు వెళ్లడం చూడవచ్చు. అదే కారు డిక్కీలో 10 దాకా డెడ్లీ తుపాకీలు ఉండటం గమనించవచ్చు. ఒక హైవే మీదుగా ఈ కారులో వరుణ్ తేజ్ దూసుకెళ్తూ చివరికి కొందరు శత్రువులను కలవడం చూడవచ్చు. గన్‌ పట్టుకొని వారందరినీ చంపడం, వెంటాడి కొట్టడం, బైక్ ల మీద చేజింగ్ చేయడం కూడా కనిపించింది. జా డ్రాపింగ్ షూట్ అవుట్స్, ఇంటెన్స్ ఫైట్లు కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

 

ఈ ప్రీ టీజర్‌ చూస్తూ ఉంటే జాన్విక్ రేంజ్‌లో హాలీవుడ్ మూవీ చూసిన అనుభూతి కలుగుతోందని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. జేమ్స్ బాండ్ లెవెల్ లో ఇది ఉందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రవీణ్ సత్తారు మెగా ప్రిన్స్‌ని మునుపెన్నడూ లేని అవతార్‌లో చూపించారేమో అని ఊహాగానాలు చేస్తున్నారు. ఇప్పుడు టీజర్ కోసం అంచనాలు అభిమానుల్లో బీభత్సంగా పెరిగాయి, ఇది త్వరలో విడుదల కానుందని ప్రీ టీజర్‌లో తెలిపారు.

 

ఇక ఈ యాక్షన్ డ్రామాలో ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య కథానాయికగా నటించింది. ఈ మూవీ ప్రొడక్షన్ పూర్తయింది. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మరి మూవీ ఎంత పెద్ద హిట్ సాధిస్తుందో చూడాలి.