పెద్ద రిస్కే చేయబోతున్న బాలయ్య..ఈసారి ఆ దేవుడే దిక్కా..?

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తూ నేటి సినిమా ఇండస్ట్రీని గజగజలాడిస్తున్న బాలయ్య రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య భగవత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు టీజర్ ఆధారంగా తెలిసిపోయింది . ఈ సినిమాలో బాలయ్య సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

. అంతే కాదు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో బాలయ్య మాస్ రేంజ్ లో స్టెప్స్ ఇరగదీసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే బాలయ్య మెగా డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . పూజా కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి . త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది . అయితే ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ నయనతార – రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా సెలెక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య తమ్ముడుగా మాస్ మహారాజ రవితేజ నటించిన బోతున్నాడట .

అంతేకాదు ఈ సినిమాలో రవితేజ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఆల్రెడీ వాల్తేరు వీరయ్య సినిమాతో బాబి – రవితేజ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది . ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కోసం రవితేజ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ సెలెక్ట్ చేసుకున్నారట. అయితే వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్టు అందుకున్న రవితేజ ఆ తర్వాత వచ్చిన రావణాసురతో డిజాస్టర్ అయ్యాడు . ఇప్పట్లో హిట్ కొడతాడు అన్న నమ్మకాలు లేవు . అలాంటి హీరోని తీసుకొచ్చి బాలయ్య సినిమాలో పెట్టాడు ఏంటా ..?అంటూ జనాలు మండిపడుతున్నారు . అంతేకాదు ఈ సినిమా ఫ్లాప్ అయితే ఈసారి రవితేజకు ఆ దేవుడే దిక్కు అంటూ చీప్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు బాలయ్య ఈ డెసిషన్ కి ఒప్పుకొని పెద్ద రిస్కే చేస్తున్నాడు అంటున్నారు నందమూరి అభిమానులు..!!