అరుదైన రికార్డు సాధించిన నందమూరి బాలకృష్ణ… ఇలాంటివి ఆయనకే చెల్లుతాయి!

నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ఇక్కడ ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు. ఈయనకు రాయలసీమలో వున్న అభిమానులు మరేచోట ఉండరంటే అతిశయోక్తికాదు. రాయలసీమ అంటే బాలయ్య, బాలయ్య అంటే రాయలసీమ. ముఖ్యంగా బాలయ్య డిజాస్టర్ సినిమాలు కూడా రాయలసీమలో కళ్ళు చెదిరే స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ ఉంటాయి. అంతలా ఆయనంటే అక్కడ పడిచచ్చేవాళ్ళు వుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన వీర సింహారెడ్డి సినిమా 175 రోజులు ఇటీవల పూర్తి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బాలయ్య నటించిన అఖండ సినిమా కూడా థియేటర్లలో ఎక్కువ రోజులు ప్రదర్శించబడింది.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బాలయ్య సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడంతో బాలయ్య ఖాతాలో అరుదైన రికార్డులు వచ్చి చేరుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్నూలు జిల్లాలోని ఆలూరులో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ థియేటర్ లో వీరసింహారెడ్డి సినిమా ఏకంగా 175 రోజులపాటు ప్రదర్శించబడి అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఇన్ని రోజుల వరకు ఈ సినిమా భారీ ఆక్యుపెన్సీ తోనే ప్రదర్శితం అవడం గమనార్హం. అంతేకాదు సి సెంటర్లో బాలయ్య బాబు నటించిన ఈ సినిమా ఇలా అరుదైన ఘనత దక్కించుకోవడంతో అభిమానులు మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అది మాత్రమే కాకుండా ఆయన తదుపరి చిత్రాలు కూడా ఇదే విధంగా రికార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇకపోతే ఈమధ్య కాలంలో హ్యాట్రిక్ విజయాల విషయంలో బాలయ్య కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి. ఒకవేళ తాజాగా ఆయన నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా గనుక హిట్ సాధిస్తే కచ్చితంగా ఈయన ఒక హ్యాట్రిక్ విజయం అందుకున్నట్లే అనే సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో తప్పకుండా ఈసారి బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే బాలయ్య సిల్వర్ జూబ్లీ రికార్డ్ విషయంలో సీనియర్ స్టార్ హీరోలలో నంబర్ వన్ హీరోగా నిలిచారని చెప్పవచ్చు.