చరణ్ కి కూతురు పుట్టడం చిరంజీవి కి ఇష్టం లేదా..? మెగా హేటర్స్ కి అడ్డంగా దొరికిపోయిన మెగాస్టార్..!?

అసలే సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని హేట్ చేసే వాళ్ళ లిస్ట్ రోజురోజుకీ ఎక్కువ అయిపోతుంది. దానికి తగ్గట్టు మెగా ఫ్యామిలీలో ఉండే మెంబెర్స్ తీసుకుంటున్న డెసీషన్స్ మరింత స్థాయిలో వాళ్ళని సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురి అయ్యేలా చేస్తుంది. కాగా ఇప్పటికే మెగా డాటర్ శ్రీజ – మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకొని మెగా పరువును సగం గంగలో కలిసిపోయేలా చేశారు . దీంతో సోషల్ మీడియాలో ఇద్దరు మెగా డాటర్ లని అని దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు జనాలు.

అయితే రీసెంట్గా చిరంజీవి కూడా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు. ఎస్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి అమెరికా వెళ్లారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు చిరంజీవి . “భార్యతో అమెరికాకు వెళ్తున్నానని.. రిఫ్రెష్ అయ్యాక మళ్లీ షూటింగ్లో జాయిన్ అవుతానని చెప్పుకువచ్చాడు . ఇంతవరకు బాగానే ఉన్నా ..అసలు చిరంజీవి అమెరికాకు వెళ్లాల్సిన అవసరం ఏముంది..? అన్న ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది”.

” నిన్న కాక మొన్ననే కదా మనవరాలు పుట్టింది.. మరి ఆ బిడ్డతో ఆడుకోకుండా ఎంజాయ్ చేయకుండా భార్యతో అమెరికాకి వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ ..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కొంతమంది మెగా హేటర్స్.. చరణ్ కి పాప పుట్టడం చిరంజీవికి ఇష్టం లేదు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో చిరంజీవి సురేఖల ఫారిన్ ట్రిప్ కి వెళ్తున్న ఫొటోస్ వైరల్ గా మారాయి. మొత్తానికి చిరంజీవి అనవసరంగా అమెరికా టూర్ ప్లాన్ చేసి మెగా హేటర్స్ కు అడ్డంగా దొరికిపోయాడు అంటూ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు .