పాపం ప్ర‌గ్యా.. రోజురోజుకి వాటి సైజ్ త‌గ్గిస్తున్నా ఒక్క హీరో కూడా క‌న్నెత్తి చూడ‌ట్లేదు!

ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లో జ‌న్మించిన ఈ బ్యూటీ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `కంచె` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. అంత‌కుముందు డేగ, మిర్చిలాంటి కుర్రాడు వంటి చిత్రాలు చేసింది. కానీ, అవి ప్ర‌గ్యాకు గుర్తింపు తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. కంచె మూవీతో అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్లు ప్ర‌గ్యాకు క్యూ క‌ట్టాయి. అయితే క‌థ‌లో ఎంపిక‌లో చేసిన పొర‌పాట్ల కార‌ణంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ప‌డ‌టంతో.. ప్ర‌గ్యా కెరీర్ డేంజ‌ర్ జోన్ లో ప‌డింది. ఐర‌న్ లెగ్ అనే ముద్ర కూడా వేశాడు. కెరీర్ క్లోజ్ అనుకుంటున్న త‌రుణంలో ప్ర‌గ్యా ఖాతాలో `అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చి ప‌డింది. ఇక ఆమె ద‌శ తిరిగిన‌ట్లే అని అంతా అనుకున్నా అది జ‌ర‌గలేదు.

అఖండ త‌ర్వాత ప్రగ్యా జైస్వాల్ క‌నీసం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కు కూడా సైన్ చేయ‌లేక‌పోయింది. దీంతో వెకేష‌న్స్ లోనే టైమ్ పాస్ చేస్తూ.. సోషల్ మీడియాలో స్కిన్ షోతో ద్వారా ఆఫ‌ర్లు అందుకునేందుకు తెగ ట్రై చేస్తోంది. తాజాగా కూడా మినీ డ్రెస్ లో క్యూట్ పోజుల‌తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టించింది. చైర్ లో సోకుల విందు చేసింది. అయితే ఈ పిక్స్ చూసిన నెటిజ‌న్లు ప్ర‌గ్యాపై సెటైర్లు పేలుస్తున్నారు. పాపం ప్ర‌గ్యా.. రోజురోజుకి బ‌ట్ట‌ల సైజ్ త‌గ్గిస్తున్నా ఒక్క హీరో కూడా ఆమెవైపు క‌న్నెత్తి చూడ‌ట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)