టైట్ డ్రెస్ లో టెంప్ట్ చేస్తున్న పూజా హెగ్డే..ఫోటోలు వైరల్

పూజా హెగ్డే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో నటించింది. వరుస సినిమాతో పూజా హెగ్డే బిజీబిజీగా ఉంది. సినిమాల్లోనే కాకుండా పూజా హెగ్డే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. తాజాగా వైట్ బాడీ కాన్ డ్రెస్ తో పూజ షేర్ చేసిన ఫోటోలు టెంప్టింగ్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బుట్టబొమ్మ షేర్ చేసిన ఈ ఫోటోలు కొన్ని క్షణాల్లోనే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.


అయితే సినిమాల్లో మాత్రం బుట్టబొమ్మకు బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. కొత్త ఆఫర్లు పక్కనపెడితే ఉన్న ఆఫర్లు కూడా చేజారుతున్నాయి. ఇప్పటికే మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి పూజ తప్పుకున్న వార్త అందరికి తెలిసిందే. పూజ సినిమాకు తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి గుంటూరు కారంకి గుడ్ బై చెప్పేసింది. ఇప్పటికే వరుస సినిమాలు ప్లాప్ అవుతుండగా ఈ సినిమా ఇలా కావడంతో షాక్ తగిలింది. ఈ సినిమాతో పాటు జనగణమన అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోల్పోయింది. ఇప్పుడు పూజ కెరీర్ ప్రమాదంలో ఉండనే చెప్పాలి. పూజ నటించిన 6 సినిమాలు ప్లాప్స్ అయ్యాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య అన్ని సినిమాలు వరుసగా ప్లాప్స్ కావడంతో పూజకు షాక్ తగిలింది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు ప్లాప్ కావడంతో పూజకు ఆఫర్లు తక్కువయ్యాయి.

బాలీవుడ్ లో చేసిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ నిరాశపరిచింది. దీనికి తోడు పూజకు గట్టి కంపిటేషన్ ఉంది. ఇప్పటికే శ్రీలీల, కృతి శెట్టి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. పూజకు ఇప్పుడు కచ్చితంగా ఒక హిట్ సినిమా కావలిందే. లేదంటే మరిన్ని ఆఫర్లు చేజారే అవకాశాలు ఉన్నాయి.