లండన్ వెకేషన్ నుంచి అదిరిపోయే ఫోటోస్‌ పోస్ట్ చేసిన నమ్రత…

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల నుండి కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి చెక్కేస్తుంటారు. అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేసి, రిలాక్స్ అయ్యి, డబుల్ ఎనర్జీతో తిరిగి వచ్చి షూటింగ్స్ లో పాల్గొంటారు మహేష్ . అయితే తాజాగా మహేష్ బాబు,నమ్రత తమ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తు హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనపడిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వారు లండన్ కి వెళ్లి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ పేజ్ ద్వారా అభిమానులతో పంచుకుంది నమ్రత. వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోలను నమ్రత షేర్ చేసింది.

ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఫోటోలను షేర్ చేస్తూ నమ్రత ‘ ఆహారం,కథలు ఆనందాలను పంచుకోవడంలో బంధం ‘ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా కథలు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తున్న తీపి జ్ఞాపకాలు అని నమ్రత ఉదేశ్యం. అయితే నమ్రత షేర్ చేసిన ఫొటోస్ లో మహేష్ హెయిర్ స్టైల్ కాస్త డిఫరెంట్ గా కనపడింది. నిజానికి మహేష్ బాబు హెయిర్ స్టైల్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కానీ ఫొటోస్ లో మహేష్ కొత్తగా కనిపించారు. అంతేకాకుండా ఆ ఫొటోస్ లో మహేష్ బాబు చాలా యంగ్ గా కూడా  కనిపిస్తున్నారు.

లండన్ లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ఫ్యామిలీ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అలానే ‘మహేష్ అన్న నీ లుక్ చాలా బాగుంది. టీనేజ్ కుర్రాళ్ల కనిపిస్తున్నావ్, మహేష్ అన్నని బాగా చూసుకో వదిన’  అంటూ నమ్రతకి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలానే ఈ సినిమా లో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ పూర్తి అవడంతో మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లి తన ఫ్యామిలీ తో లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.