నీహారిక విడాకులతో రామ్ చరణ్ కు సంబంధం ఏంటి..? మెగా హెటర్స్ ఇంతకు తెగించారు ఏంట్రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం.. భూతద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు మెగా ఫ్యామిలీపై ట్రోల్ చేయడానికి వాళ్ళ పరువును బజారుకు ఈడ్చడానికి రెడీగా ఉంటున్నారు . చిన్న విషయం దొరికిన సరే ఆ విషయాన్ని ఏకీపారిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి .

కాగా కొద్దిగంటల క్రితం మెగా డాటర్ నిహారికకి ఆయన భర్త చైతన్యకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది. దీంతో ఇన్నాళ్లు వీళ్ల విడాకులు తీసుకుంటారా..? తీసుకోరా ..? అన్న ప్రశ్నలకు ఆన్సర్ దొరికేసింది. నిహారిక ఇప్పుడు చైతన్య మాజీ భార్యగా మారిపోయింది . ఇకపై వీరిద్దరిని భార్యాభర్తలు అని పిలిచే అధికారం ఎవరికి లేదు. కాగా సోషల్ మీడియాలో నిహారిక విడాకులు తీసుకోవడానికి రామ్ చరణ్ కూతురిని లింకు పెడుతూ పలు వార్తలు వైరల్ చేస్తున్నారు మెగా హేటర్స్.

మనకు తెలిసిందే రామ్ చరణ్ కు రీసెంట్ గానే పాప పుట్టింది . బారసాల ఫంక్షన్ ని కూడా చేసి “క్లీం కార” అంటూ పేరు పెట్టుకోవచ్చారు మెగా కుటుంబ సభ్యులు . అయితే ఆ ఫంక్షన్ అయిపోయిన నాలుగు రోజులకే నిహారిక విడాకులు అఫీషియల్ గా కన్ఫామ్ అవడం ఫ్యామిలీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇన్నాళ్లు నిహారిక విడాకులు విషయాని కన్ ఫామ్ చేయనిది రాంచరణ్ బిడ్డ కోసమే అని ..ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయాలి కానీ.. నా విడాకులు వార్త విని బాధపడకూడదు అన్న క్రమంలోనే నిహారిక బిడ్డ పుట్టి పేరు పెట్టిన నాలుగు రోజులకి విడాకులను కన్ఫామ్ చేసుకుందని.. తలా తొక్క లేని లాజిక్కులు పెట్టి మెగా ఫ్యామిలీ పరువును తీసేస్తున్నారు మెగా హేటర్స్.

దీంతో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పురిటి బిడ్డ పై కూడా మీ ట్రోలింగా..? ఇలా ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు ..అంటూ మండిపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో రామ్ చరణ్ కూతురు “క్లీం కార” – మెగా డాటర్ నిహారిక పేర్లు వైరల్ గా మారాయి..!!