ఐరన్ లెగ్ హీరోయిన్ ని సెట్ చేసుకుంటున్న మాస్ మహారాజా..!!

హీరో రవితేజ సినిమాలలో హీరోయిన్లను మాత్రం తన క్రేజ్ కు తగ్గట్టుగానే సెట్ చేసుకుంటూ ఉంటారు.. రవితేజ ఎలాంటి సినిమా చేసిన సరే ట్రెండీగా ఉన్న హీరోయిన్స్ ని ఖచ్చితంగా తమ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళతో రిస్క్ తీసుకోవడం కన్నా సక్సెస్ అయిన వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ మరో సినిమాకి కమిట్ అయినట్లుగా తెలుస్తోంది.

Ravi Teja to romance Pooja Hegde? | Manacinema

వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న ఈ కొత్త ప్రాజెక్టు విషయంలో రవితేజ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఒక సినిమా షూట్లో ఉండగానే మరొక ప్రాజెక్టును కూడా మొదలుపెట్టేసి చకచకా షూటింగ్ను పూర్తి చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మల్లిలేని తో ఒక ప్రాజెక్టు ప్రకటించి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా సరే వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్గా స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె ఎవరో కాదు హీరోయిన్ పూజా హెగ్డే.. ఈ సినిమా పక్క మాస్ కదా అంశంతో తెరకెక్కిస్తూ ఉండడంతో పూజ హెగ్డే అయితే పర్ఫెక్ట్ గా రవితేజకు జోడిగా సెట్ అవుతుందని చిత్ర బృందం భావించిందట. ఇందులో భాగంగానే ఇటీవలే ముంబైలో పూజా హెగ్డేను సంప్రదించినట్లుగా చిత్ర బృందం వార్తలు వినిపిస్తున్నాయి.. అన్ని కుదిరితే రవితేజతో పూజ హెగ్డే రొమాన్స్ చేయవచ్చని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి రవితేజ అయిన ఈ ఐరన్ లెగ్ హీరోయిన్ జాతకాన్ని మారుస్తారేమో చూడాలి మరి. మరి రవితేజ సినిమాకు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనే విషయం చూడాలి మరి.