అలా చేయడమే స్నేహ పాలిట శాపంగా మారిందా..? ఆఖరికి భర్త కూడా నా..?

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ వలకబోయడానికి ఎప్పుడు అందాల ముద్దుగుమ్మలు రెడీగా ఉంటారు . డైరెక్టర్స్ అడగాలే గాని ఉన్న బట్టలు కూడా తీసేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కొంతమంది ముద్దుగుమ్మలు . అయితే సినిమా ఇండస్ట్రీలో ట్రెడిషనల్ డ్యూటీ గా పేరు సంపాదించుకోవడం చాలా కష్టం మనకు ఇష్టం లేకపోయినా సరే అలా మనతో చేయించడానికి డైరెక్టర్ చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటారు కానీ సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా అలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా ట్రెడిషనల్ బ్యూటీగానే కొనసాగుతూ వచ్చింది అందాల ముద్దుగుమ్మ ట్రెడిషనల్ బ్యూటీ స్నేహ .

ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో హోంలీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న స్నేహ .. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో అడపాదడపా కనిపిస్తూనే వచ్చింది. అయితే ఎక్కడ కూడా స్టార్ హీరో సినిమాల్లో అవకాశం అందుకోలేకపోయింది . దీనికి కారణం స్నేహ ట్రాక్ రికార్డ్ . హోంలీ బ్యూటీగా మెరిసిందే కానీ ఎక్కడ ఆమెకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయని చెప్పలేం.

ఈ కారణంగానే స్టార్ హీరోలు ఆమెను లైక్ చేశారే కానీ అవకాశాలు ఇవ్వలేకపోయారు. అంతేకాదు ఒక హీరోయిన్ ని తమ సినిమాల్లోకి పెట్టుకోవడానికి హీరోలు చాలా రకాలుగా చూస్తారు ఓటీటీ రైట్స్ .. మార్కెటింగ్ ..డిజిటల్ రైట్స్ ఆ హీరోయిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని.. ఈ లెక్కన చూసుకుంటే స్నేహ ఎప్పటికి స్టార్ హీరో సినిమాల్లో అవకాశం దక్కించుకొదు . కేవలం ట్రెడిషనల్ బ్యూటీ అన్న పదమే ఆమె పాలిట శాపంగా మారిందని ..ట్రెడిషనల్ రోల్స్ మాత్రమే చేయడం ఆమెకు అవకాశాలు లేకుండా చేసిందని జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఆఖరికి స్నేహ భర్త కూడా ఆమెను ట్రెడిషనల్ రోల్స్ చేయమని ఎక్స్పోజింగ్ చేయొద్దు అని చెప్పుకొచ్చారట..!!